Julian Assange: 14 ఏళ్ల తర్వాత అసాంజే ఫ్రీ.. వికీలీక్స్ ఫౌండర్‌పై అమెరికా బ్యాన్
Julian Assange: 14 ఏళ్ల తర్వాత జూలియన్ అసాంజే విముక్తి అయ్యారు. అమెరికా మిలిటరీ రహస్యాలు వెల్లడించిన కేసులో ఆయన కోర్టు కేసును ఎదుర్కొంటున్నారు. మారియానా దీవుల్లోని కోర్టు నుంచి ఆయన ఇవాళ స్వేచ్ఛగా బయటకు వచ్చారు. వికీలీక్స్ ఫౌండర్ ఎంట్రీపై అమెరికా బ్యాన్ విధించింది.
న్యూయార్క్: మిలిటరీ రహస్య పత్రాలను రిలీజ్ చేసిన కేసులో వికీలీక్స్ ఫౌండర్ జూలియన్ అసాంజే (Julian Assange) అమెరికాతో ముందస్తు ఒప్పందం కుదుర్చుకున్నారు. దానిలో భాగంగా ఇవాళ మారియానా దీవుల్లో ఉన్న కోర్టుకు ఆయన హాజరయ్యారు. కోర్టు విచారణ అనంతరం.. అసాంజే విముక్తి అయ్యారు. ఆయన స్వేచ్ఛగా కోర్టు నుంచి బయటకు వచ్చేశారు. ఎన్నో ఏళ్లుగా సాగుతున్న న్యాయపోరాటం ముగిసింది. ఇన్నాళ్లూ బ్రిటన్ జైలులో ఉన్న అసాంజే.. నిన్ననే అమెరికా కోర్టుకు వెళ్లారు. అయితే అమెరికా కోర్టు అసాంజేకు తాజాగా ఎటువంటి శిక్షను విధించలేదు. దీంతో ఆయన తన స్వంత దేశం ఆస్ట్రేలియాకు పయనం అవుతున్నారు.
మిలిటరీ సమాచారాన్ని లీక్ చేసిన కేసులో అసాంజే తీవ్రమైన జైలు శిక్షను లండన్‌లో అనుభవించారు. దేశద్రోహం కేసులో అమెరికాతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత అసాంజే కోర్టును ఆశ్రయించారు. బ్రిటన్ జైలులో అసాంజే అయిదేళ్లు శిక్షను అనుభవించారు. అంతకుముందు ఆయన ఈక్వడార్ ఎంబసీలో ఏడేళ్లు గడిపారు. అసాంజే రిలీజ్ పట్ల ఆయన భార్య స్టెల్లా సంతోషం వ్యక్తం చేశారు.
దాదాపు 14 ఏళ్ల తర్వాత అసాంజే ఫ్రీ అయ్యారు. ఆస్ట్రేలియాలోని క్యాన్‌బెరాకు అసాంజే ప్రత్యేక విమానంలో బయలుదేరారు. 14 ఏళ్ల న్యాయపోరాటం తర్వాత అసాంజే తన స్వంత ఇంటికి స్వేచ్ఛగా వెళ్తున్నారని ఆయన తరపున వాదించిన లాయర్ జెన్ రాబిన్సన్ తెలిపారు. అసాంజే విముక్తి కావడం.. భావ స్వేచ్ఛ కేసులో విజయం సాధించినట్లే అని ఆయన తరపున లీగల్ టీమ్ పేర్కొన్నది. మీడియా స్వేచ్ఛ, జాతీయ భద్రత లాంటి అంశాలపై అసాంజే కేసు కీలకంగా మారినట్లు రాబిన్సన్ వెల్లడించారు.అసాంజే రిలీజ్‌కు సహకరించిన ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఆమె థ్యాంక్స్ తెలిపారు.
అసాంజే రిలీజ్‌పై అమెరికా న్యాయశాఖ ఓ ప్రకటన జారీ చేసింది. అమెరికాతో కుదిరిన ఒప్పందంపై చాలా వివరణాత్మకంగా ఆ నోట్లో రాశారు. అయితే ఎటువంటి అనుమతి లేకుండా అసాంజే అమెరికాలో ప్రవేశించరాదు అని నిషేధం విధించారు. అయితే ఆ ఆంక్షలపై క్షమాభిక్ష కోరనున్నట్లు స్టెల్లా అసాంజే తెలిపారు. అమెరికా నేలపై ఎటువంటి ఆంక్షలు లేకుండా కాలు మోపేందుకు అనుమతి తీసుకోనున్నట్లు ఆమె చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

