Afghanistan: అమెరికా విమానంలో ప్రసవించిన ఆఫ్ఘన్ మహిళ
ఆఫ్ఘన్ల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. తాలిబన్లకు భయపడి దేశాన్ని వీడి చెట్టుకొకరు, పుట్టకొకరుగా వెళ్లిపోతున్నారు. పిల్లాపాపలతో కొందరు, నిండు గర్భంతో మరికొందరు.. ఇల్లూవాకిలి వదిలేసి ప్రాణాలు అరచేతిలో పట్టుకొని ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )ను వీడుతున్నారు.

కాబూల్: ఆఫ్ఘన్ల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. తాలిబన్లకు భయపడి దేశాన్ని వీడి చెట్టుకొకరు, పుట్టకొకరుగా వెళ్లిపోతున్నారు. పిల్లాపాపలతో కొందరు, నిండు గర్భంతో మరికొందరు.. ఇల్లూవాకిలి వదిలేసి ప్రాణాలు అరచేతిలో పట్టుకొని ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )ను వీడుతున్నారు. అయితే ఇలా నిండు గర్భంతో ఉన్న ఓ మహిళ జర్మనీ వెళ్తున్న అమెరికా విమానంలో ప్రసవించింది. జర్మనీలోని రామ్‌స్టెయిన్ ఎయిర్‌బేస్‌కు వెళ్తున్న తమ విమానంలో ఓ మహిళకు పురిటి నొప్పులు వచ్చినట్లు యూఎస్ ఎయిర్ మొబిలిటీ కమాండ్ తన ట్విటర్లో వెల్లడించింది. ఈ విమానం ల్యాండవగానే.. వైద్య సిబ్బంది విమానంలోకి వెళ్లి ఎయిర్‌క్రాఫ్ట్ కార్గో ప్రాంతంలో ఆ మహిళకు పురుడు పోశారు. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆ మహిళ క్షేమంగానే ఉన్నట్లు కూడా యూఎస్ ఎయిర్ మొబిలిటీ కమాండ్ తెలిపింది.
నిజానికి గాల్లో ఉన్న సమయంలోనే ఆమెకు నొప్పులు రావడంతో పరిస్థితి విషమించేలా కనిపించిందని, గాలి ఒత్తిడిని తగ్గించడానికి పైలట్లు విమానాన్ని తక్కువ ఎత్తులో తీసుకెళ్లారని చెప్పింది. దీని కారణంగా తల్లి ప్రాణం నిలిచినట్లు వెల్లడించింది. మరోవైపు ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఇప్పటి వరకూ అమెరికా బలగాలు 17 వేల మందిని వేర్వేరు దేశాలకు తరలించినట్లు వైట్‌హౌజ్ వెల్లడించింది.
Medical support personnel from the 86th Medical Group help an Afghan mother and family off a U.S. Air Force C-17, call sign Reach 828, moments after she delivered a child aboard the aircraft upon landing at Ramstein Air Base, Germany, Aug. 21. (cont..) pic.twitter.com/wqR9dFlW1o
— Air Mobility Command (@AirMobilityCmd) August 21, 2021
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

