Afghanistan: భద్రతా దళాలను బలోపేతం చేయడమే లక్ష్యం: అష్రఫ్ ఘనీ

కాబూల్ : తాలిబన్ల ఆక్రమణతో ఆఫ్ఘనిస్తాన్ ( Afghanistan ) ఉక్కిరిబిక్కిరవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రాజీనామా చేసి తన కుటుంబంతో కలిసి దేశం విడిచి వెళ్లనున్నట్లు వార్తలు వ్యాపించాయి. అయితే ఆ వార్తలకు భిన్నంగా ఇవాళ ఘనీ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. దేశ భద్రతా దళాలను పునరుత్తేజం చేయడమే తన లక్ష్యమని ఆయన అన్నారు. ఓ వీడియో ద్వారా సందేశం ఇచ్చిన ఘనీ.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సెక్యూర్టీ, రక్షణ దళాలను బలోపేతం చేయాలని, ఆ దిశగా చాలా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. అస్థిరతను ఆపేస్తామన్నారు. అమెరికా సేనలు ఉపసంహరణ తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌లో మళ్లీ తాలిబన్లు రెచ్చిపోతున్నారు. ఒక్కొక్క నగరాన్ని తమ హస్తగతం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆ దేశంలో రెండవ అతిపెద్ద పట్టణమైన కాందహార్ .. తాలిబన్ల వశమైంది. ప్రస్తుతం తాలిబన్ ఫైటర్.. కాబూల్ సరిహద్దుల్లో పాగా వేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే వాళ్లు రాజధాని కాబూల్‌ను కూడా స్వాధీనం చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరో వైపు ఆ నగరంలో ఉన్న విదేశీ కార్యాలయాలను మూసివేస్తున్నారు. వాటిల్లో పనిచేసే సిబ్బందిని ఆయా దేశాలకు తరలిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

