ఫ్లోరిడా: ఐకాన్ పార్క్‌లోని ఓర్లాండో ఫ్రీ ఫాల్ రైడ్‌లో మరణించిన టైర్ శాంప్సన్ తల్లిదండ్రులకు రూ.2,612 కోట్లు నష్ట పరిహారంగా చెల్లించాలని ఆరెంజ్ కౌంటీ జ్యూరీ గురువారం ఆదేశించింది. టైర్ తల్లిదండ్రులు నెకియా డాడ్, యమెల్ శాంప్సన్లకు ఈ భారీ పరిహారంలో చెరి సగం ఇవ్వాలని ఈ రైడ్ మాన్యుఫ్యాక్చరర్ ఫన్టైమ్కు జ్యూరీ తెలిపింది.
టైర్ 2022 మార్చి 24న రైడ్ చేశాడు. సీట్ బెల్ట్ సరైనది కాకపోవడంతో 70 అడుగుల ఎత్తు నుంచి పడి, ప్రాణాలు విడిచాడు. ఫన్‌టైమ్ కంపెనీ ఆస్ట్రియాకు చెందినది. కాబట్టి, ఆరెంజ్ కౌంటీ జ్యూరీ ఆదేశాల అమలు కోసం నెకియా, యమెల్ ఆస్ట్రియా కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది.