మాస్కో: అమెరికా యుద్ధ ట్యాంక్ ఎం1 అబ్రామ్స్(Abrams Tank) కు ఎంతో ప్రత్యేక ఉన్నది. ఆ యుద్ధ ట్యాంక్‌ల కోసం ఉక్రెయిన్ చాలా ఎదురుచూసింది. అమెరికా ఆ యుద్ధ ట్యాంక్‌లను ఇస్తే.. రష్యాను ముప్పుతిప్పలు పెట్టవచ్చు అని భావించింది. కానీ డోనస్కీ వద్ద ఇటీవల రష్యా డ్రోన్ చేసిన దాడిలో.. యుద్ధ ట్యాంక్ ఎం1 అబ్రామ్స్ తుక్కుతుక్కైంది. కీవ్ దళాలకు అండగా నిలుస్తుందనుకున్న ఆ ట్యాంక్‌ను రష్యన్లు ఈజీగా పేల్చేశారు.
ట్యాంక్ పూర్తిగా మంటల్లో కాలిపోయిన వీడియోలు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. ఎఫ్‌పీవీ సూసైడ్ డ్రోన్ దాన్ని అటాక్ చేసినట్లు తేలింది. ట్యాంక్‌లోని అమ్యూనిషన్ కంపార్ట్మెంట్ పూర్తిగా కాలింది. ఇక ఇంజిన్ కంపార్ట్మెంట్ లో కూడా మంటలు చెలరేగాయి. ఉక్రెయిన్‌కు 31 ఎం1 అబ్రామ్స్ ట్యాంక్‌లను సరఫరా చేసేందుకు అమెరికా 2022లో ఆమోదం తెలిపింది. కానీ ఆ ట్యాంక్‌లు ఉక్రెయిన్ ఫ్రంట్‌లైన్ లేవని తెలుస్తోంది.
కేవలం ప్రచార వీడియోలకు మాత్రమే ఆ ట్యాంక్‌లను ఉక్రెయిన్ వాడుతున్నట్లు రష్యా ఆరోపిస్తోంది.