అందమైన బీచ్‌తో అమ్మకానికి ఓ ఊరు.. ధర కేవలం రూ.1.28 కోట్లు

లండన్: ఇది చదవగానే.. ఏంటీ జోక్ చేస్తున్నారా అని మీరు అనుకోవచ్చు. హైదరాబాద్‌లోని మంచి ఏరియాలో ఫ్లాట్ కొనాలన్నా సరిపోని ఈ మాత్రం డబ్బుతో ఓ ఊరేంటి? అందమైన బీచేంటి అన్న డౌట్ మీకు రావచ్చు. కానీ ఇది నిజమే. స్కాట్లాండ్లో ఈ ఊరిని అమ్మకానికి పెట్టారు. కేవలం 1,73,000 డాలర్లు (రూ.1,28,91,700 మాత్రమే)కే అమ్మకానికి ఈ ఊరు సిద్ధంగా ఉంది. ఈ ఊళ్లో ఇప్పుడు ఎవరూ లేరు. ఒక్క దెయ్యం తప్ప. అవును.. ఇక్కడ ఓ దెయ్యం ఉన్నట్లు అక్కడి వాళ్లు నమ్ముతారు. ఓల్డ్ విలేజ్ ఆఫ్ లాయర్స్ అనే ఈ ఊరు 3.31 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దీనికి ప్రత్యేకంగా ఓ ప్రైవేట్ బీచ్ కూడా ఉంది. దీనిని కొన్నవాళ్లు అక్కడ చేపలను కూడా పట్టుకునేందుకు అనుమతి ఇస్తారు.
ఏంటీ ఊరు కథ?
ఈ ఊరు 17వ శతాబ్దంనాటిది. ఇక్కడ లేడీ ఆఫ్ లాయర్స్ అనే ఓ జ్యోతిష్యురాలి ఇల్లు ఉంది. ఇప్పటికే ఆమె దెయ్యంలా మారి ఇక్కడే తిరుగుతున్నట్లు అక్కడి వాళ్లు నమ్ముతారు. అప్పట్లో ఆమె అంచనా వేసిన అన్ని విషయాలూ నిజమయ్యేవని చెబుతారు. ఇక్కడ ఆమె ఓ బూడిద చెట్టును నాటిందని, అది లిటిల్ స్పైర్ (ఓ రకం మొక్క) అంత ఎత్తుకు ఎదిగినప్పుడు అక్కడ ఉన్న చర్చి కూలిపోతుందని ఆమె చెప్పిందట.
ఆ తర్వాతి కాలంలో నిజంగానే ఓ పెను తుఫాను ధాటికి అక్కడి చర్చి ధ్వంసమైంది. ఆ బూడిద చెట్టు కూడా లేకుండా పోయింది. అప్పటి నుంచీ ఆ చర్చిని, ఇంటిని ఎవరూ ఉపయోగించలేదు. 1841 జనాభా లెక్కల ప్రకారం ఈ గ్రామంలో 17 మంది ఉండేవారు. 1891 వచ్చేసరికి వీరి సంఖ్య ఏడుకు తగ్గింది. 1926 నుంచి ఇక్కడ ఒక్కరు కూడా లేరు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

