Birch Glacier | జెనీవా, మే 29: స్విస్ పర్వత ప్రాంతంలో గురువారం హిమానీనదం నుంచి భారీ రాతి, మంచు పెళ్లలు విరిగిపడటంతో అల్పైన్ అనే గ్రామం తుడిచిపెట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో 64 ఏండ్ల వ్యక్తి గల్లంతయ్యాడు.
గ్రామం అంతా బురద, రాళ్లు రప్పలతో నిండి పోయింది.1.5 మిలియన్ క్యూబిక్ మీటర్ల హిమానీ నదం కూలిపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు ముందస్తు హెచ్చరికలతో ఇటీవలే 300 మంది గ్రామస్తులను ఖాళీ చేయించారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు చెప్పారు.