Bullet Train | టోక్యో, ఏప్రిల్ 17: సమయపాలనకు మారు పేరు జపాన్లోని బుల్లెట్ రైళ్లు. షింకాన్సేన్గా వ్యవహరించే ఈ బుల్లెట్ ట్రైన్లు కొద్ది నిమిషాలు ఆలస్యంగా నడవడం కూడా చాలా అరుదు. అలాంటి బుల్లెట్ రైలు ఒకటి, రెండు నిమిషాలు కాదు ఏకంగా 17 నిమిషాలు ఆలస్యంగా నడిచింది. దీనంతటికీ కారణం రైలులో ఒక పాము అలజడి సృష్టించడమే!
మంగళవారం నాగోయ, టోక్యో మార్గంలో వెళ్తున్న బుల్లెట్ రైలులో ఒక ప్రయాణికుడికి 17 అంగుళాల పొడవైన పాము కనిపించింది. వెంటనే అతడు సెక్యూరిటీకి సమాచారం ఇచ్చాడు. దీంతో ట్రైన్లోని సిబ్బంది రంగ ప్రవేశం చేసి పాము కోసం వెతికారు. ఈ గందరగోళం మధ్య రైలు 17 నిమిషాలు ఆలస్యమైంది.