టొరంటో, నవంబర్ 18: క్రమం తప్పకుండా తేనెను తీసుకుంటే మధుమేహం, కొలెస్ట్రాల్ అదుపులో ఉంటాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. తేనెతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని తేలింది. అయితే ఒకేరకం పువ్వుల నుంచి తయారైన ముడితేనె అయితేనే సత్ఫలితాలు ఉంటాయని అంటున్నారు. చెడు కొలెస్ట్రాల్‌ను, ట్రైగిజరైడ్స్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను తేనె పెంచినట్టు యూనివర్సిటీ ఆఫ్ టొరెంటో పరిశోధకులు జరిపిన పరిశోధనలో రుజువైంది.
80 శాతం చక్కెర కలిగి ఉండే తేనె వల్ల ఇన్ని సత్ఫలితాలు రావడం ఆశ్చర్యంగా ఉన్నదని అధ్యయనంలో పాల్గొన్న సీనియర్ పరిశోధకుడు తౌసీఫ్ఖాన్ అన్నారు. అయితే తేనె అనేది సాధారణమైన, అరుదైన చక్కెరలు, ప్రొటీన్లు, ఆర్గానిక్ యాసిడ్లు, ఇతర బయోయాక్టివ్ కాంపౌండ్స్‌తో కూడిన సంక్లిష్ట మిశ్రమం అన్నది గుర్తుంచుకోవాలని ఖాన్ చెప్పారు.