Moon | మాస్కో, మార్చి 6: భవిష్యుత్తులో చంద్రుడిపై ఆవాసం ఏర్పరుచుకుంటే.. అక్కడ ఇంధన సమస్యలు రాకూడదన్న ఆలోచనతో రష్యా, చైనాలు సంయుక్తంగా ఓ ప్రాజెక్ట్‌ను చేపట్టాయి. 2035 నాటికల్లా చంద్రుడిపై అణు విద్యుత్తు ప్లాంట్‌ను నిర్మించేందుకు సిద్ధమవుతున్నాయి.
చంద్రుడిపై అన్వేషణ, నివాసాన్ని ఏర్పాటుచేయాలన్న పరిశోధనలో ఇరు దేశాలు ఒకదానికొకటి సహకరించుకోనున్నాయి. ఉపగ్రహంపై విద్యుత్తు డిమాండ్‌ను ఎదుర్కొనేందుకు ఈ ప్రాజెక్ట్ దోహదపడుతుందని రష్యా స్పేస్ ఏజెన్సీ ‘రోస్కాస్మోస్’ చీఫ్ యూరి బోరిసోవ్ తెలిపారు.