‘పెద్దన్న’కు ప్రత్యామ్నాయ వేదిక ? పావులు కదుపుతున్న రష్యా-చైనా
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఉక్రెయిన్‌పై ఎలాగైనా పై చేయి సాధించాలని రష్యా పట్టుదలతో వుంది. రష్యా పట్టుదలకు అడ్డుకట్ట వేయాలని అమెరికా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ వ్యవహారం ఇలా నడుస్తున్న తరుణంలో ప్రపంచ యవనికపై సరికొత్త రాజకీయ పక్షాన్ని తీసుకురావాలని, ఇలా తీసుకొచ్చి, అమెరికాను దెబ్బతీయాలని రష్యా, చైనా గట్టి పట్టుదలతో ఉన్నాయి. రష్యా, ఉక్రెయిన్ వ్యవహారం నడుస్తున్న తరుణంలోనే అమెరికా కూడా యాక్టివ్ అయ్యింది. సాధ్యమైనంత వరకూ ప్రపంచ దేశాలను తమ వైపు తిప్పుకొని, తమ బలాన్ని పెంచుకోవాలని ట్రయల్స్ చేస్తోంది. దీనికి విరుగుడుగా రష్యా, చైనా కూడా ఇదే పనిలో నిమగ్నమయ్యాయి. రష్యా చైనా, అమెరికా మధ్య ఎప్పటి నుంచో తీవ్ర విభేదాలున్నాయి. కొన్ని సంవత్సరాలుగా ఈ విభేదాలు మరింత పెరిగిపోయాయి.

ప్రపంచ యవనికపై ఎలాగైనా ఓ ప్రత్యామ్నాయాన్ని తీసుకొచ్చి, అమెరికాను దెబ్బతీయాలని రష్యాచైనా నిర్ణయించుకున్నాయి. ఇందుకు బీజింగ్ ఒలంపిక్స్‌ను వేదికగా చేసుకున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య ఓ డీల్ కుదిరింది. ఈ డీల్ గ్యాస్, చమురు సరఫరా గురించి. ప్రపంచంలోనే గ్యాస్‌ను సరఫరా చేసే మూడో అతి పెద్ద దేశం చైనా. ఇక ప్రపంచంలోనే హైడ్రోకార్బన్‌ను సరఫరా చేసే దేశం రష్యా. దీంతో ఇరు దేశాల మధ్య గ్యాస్, చమురు సరఫరా గురించి ఒప్పందం జరిగింది. ఐరోపా మొత్తానికీ రష్యా నుంచే గ్యాస్, చమురు సరఫరా అవుతుంది. అయితే రష్యా, ఉక్రెయిన్ వివాదంలోకి అమెరికా తలదూర్చింది. దీంతో పరిస్థితి మారుతోంది. దీంతో రష్యా అలర్ట్ అయ్యింది. సరికొత్త వ్యాపార భాగస్వాములను వెతుక్కునే పనిలో నిమగ్నమైంది. రష్యా, చైనా ఓ జట్టుగా ముందుకు సాగుతూ, అమెరికాకు ప్రత్యామ్నాయంగా, ప్రపంచ రాజకీయాల్లో కొత్త ప్రత్యామ్నాయం సృష్టించేందుకు ఉమ్మడిగా ప్రయత్నాలు ప్రారంభించాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- America
- russia-china
- Ukraine
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

