కోపెన్హాగెన్, జూలై 9: స్వీడన్లో స్కైడైవింగ్ విమానం కూలడంతో 9 మంది మరణించారు. మృతుల్లో పైలట్, 8 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ దుర్ఘటన గురువారం రాత్రి ఓరెబ్రో పట్టణం వెలుపల చోటుచేసుకుంది. విమానం టేకాఫ్ అయ్యే సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు.