మెక్సికో సిటీ: మెక్సికోలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఉత్తర మెక్సికోలోని జెరెజ్ పట్టణంలో ఉన్న ఓ నైట్‌క్లబ్‌లో సాయుధుడైన దుండగులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఎనిమిది మంది మృతిచెందారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. భారీగా ఆయుధాలు ఉన్న వ్యక్తులు రెండు వాహనాల్లో ఎల్‌వానాడిటో అనే నైట్‌క్లబ్‌కు వచ్చారని, అనంతరం విచక్షనారహితంగా కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు.
దుండగుల కాల్పుల్లో ఆరుగురు అక్కడికక్కడే మరణించగా, ఇద్దరు దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందారని వెల్లడించారు. బాధితుల్లో క్లబ్ ఉద్యోగులు, మ్యుజీషియన్స్, వినియోగదారులు ఉన్నారని చెప్పారు. కాగా, గతేడాది జెరెజ్లో భారీ హింసాకాండ చోటు చేసుకుంది. దీంతో సమీపంలోని గ్రామీణ కమ్యూనిటీల్లోని వందలాది మంది తమ ఇండ్లను విడిచిపెట్టి ఇతర ప్రాంతాలకు వలసవెళ్లారు.