Balochistan Blast | బలూచిస్థాన్‌లో అర్ధరాత్రి పేలుడు.. ఏడుగురు దుర్మరణం
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో (Balochistan) భారీపేలుడు (Blast) సంభవించింది. సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత బలూచిస్థాన్‌లోని పంజ్గూర్ జిల్లాలో ఓ వాహనం లక్ష్యంగా ల్యాండ్‌మైన్ పేల్చారు. దీంతో బల్గతార్ యూనియన్ కౌన్సిల్ (UC) చైర్మన్ ఇష్తియాక్ యాకూబ్‌తో (Ishtiaq Yaqoob), సహా ఏడుగురు మరణించారు.
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో (Balochistan) భారీపేలుడు (Blast) సంభవించింది. సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత బలూచిస్థాన్‌లోని పంజ్గూర్ జిల్లాలో ఓ వాహనం లక్ష్యంగా ల్యాండ్‌మైన్ పేల్చారు. దీంతో బల్గతార్ యూనియన్ కౌన్సిల్ (UC) చైర్మన్ ఇష్తియాక్ యాకూబ్‌తో (Ishtiaq Yaqoob), సహా ఏడుగురు మరణించారు. గత రాత్రి ఓ వివాహ వేడుకకు హాజరైన ఇష్తియాక్.. తన కారులో తిరుగుపయణమయ్యారు. ఈ క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న కారును లక్ష్యంగా చేసుకున్న దుండగులు.. వాహనం బల్గతార్ ప్రాంతంలోని చకర్ బజార్ వద్దకు చేరుకోగానే మందపాతరను (Landmine) పేల్చారు. దీంతో ఇష్తియాక్ సహా ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు దవాఖానలో చికిత్సపొందుతూ చనిపోయారని పంజ్గూర్ డిప్యూటీ కమిషనర్ అమ్జద్ సోమ్రో చెప్పారు.
2014, సెప్టెంబరులో ఇదే ప్రాంతంలో ఇష్తియాక్ తండ్రి యాకుబ్ బల్గాత్రి, అతని సహచరులు 10 మంది హత్యకు గురయ్యారు. నాటి దాడికి బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ (BLF) బాధ్యత వహించింది. తాజా పేలుడుకు కూడా ఆ సంస్థే పాల్పడిఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

