లండన్, మే 4: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఏడాదికి పైగా ఉండి ఇటీవలే భూమి మీదకు వచ్చిన ఓ ఫ్రెంచ్ వైన్ ధరను రూ.7.38 కోట్లుగా (10 లక్షల డాలర్లు) నిర్ణయించారు. ‘ది పెట్రస్ 2000’ అనే ఈ వైన్ బాటిల్‌ను అమ్మకానికి పెడుతున్నట్టు నిర్వాహక సంస్థ క్రిస్టీస్ వైన్ అండ్ స్పిరిట్ డిపార్ట్మెంట్స్ ప్రకటించింది. ఎక్కువమంది పోటీ పడితే వేలం వేస్తామని వివరించింది.