Hamas: 20 నిమిషాల్లోనే 5000 రాకెట్లతో అటాక్.. వీడియోలు
Hamas : హమాస్ విరుచుకుపడింది. రాకెట్లతో బెంబేలెత్తించింది. 20 నిమిషాల్లోనే 5వేల రాకెట్లను ఫైర్ చేశారు. గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయల్ పట్టణాలపై ఆ అటాక్ జరిగింది. ఆపరేషన్ అల్ అక్సా ఫ్లడ్‌లో భాగంగా ఆ ఫైరింగ్ జరిపినట్లు హమాస్ తెలిపింది.
గాజా: ఇజ్రాయిల్ మీదకు సుమారు 5 వేల రాకెట్లను ప్రయోగించినట్లు హమాస్(Hamas) గ్రూపు తెలిపింది. ఆ దేశంపై ఆపరేషన్ అల్ అక్సా ఫ్లడ్ చేపట్టినట్లు హమాస్ వెల్లడించింది. గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయిల్ నగరాల దిశగా కేవలం తొలి 20 నిమిషాల్లోనే దాదాపు 5 వేల రాకెట్లను ఫైర్ చేసినట్లు హమాస్ వెల్లడించింది. సుమారు రెండు గంటల పాటు ఆ ఫైరింగ్ ఏకధాటిగా కొనసాగినట్లు తెలుస్తోంది. దక్షిణ బోర్డర్ వద్ద హమాస్ విధ్వంసానికి దిగడంతో.. ఇజ్రాయిల్ అప్రమత్తమైంది. యుద్ధాన్ని ప్రకటిస్తూ రణగర్జన చేసింది. హమాస్ మిలిటెంట్లు చొరబడిన ప్రాంతాల్లో ఐడీఎఫ్ దళాలు రంగంలోకి దిగాయి.
🚨 BREAKING – A significant number of rocket attacks fired up from Gaza towards Israel.
Credits – ww3info#Israel #Palestine #War #Hamas #Rockets #Gaza #Palestinian#TelAviv #Jerusalem pic.twitter.com/v3sHNJIAvc
— T R U T H P O L E (@Truthpole) October 7, 2023
పాలస్తీనాలోని హమాస్ గ్రూపు మిలిటెంట్లను.. ఇజ్రాయిల్‌లో ఉగ్రవాదులుగా భావిస్తారు. ఆ అటాక్ కోసం ఉగ్రవాదులు పారాగ్లయిడర్స్ కూడా వాడినట్లు తెలుస్తోంది. త్వరలోనే సెక్యూర్టీ చీఫ్‌లతో మీటింగ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతాన్యహూ తెలిపారు. హమాస్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రధాని కార్యాలయం తెలిపింది. హమాస్ అటాక్ నేపథ్యంలో గాజా స్ట్రిప్ వద్ద ఉన్న 80 కిలోమీటర్ల పరిధిలో ఇజ్రాయిల్ రక్షణ మంత్రి యోవ్ గాలెంట్ ఎమర్జెన్సీ ప్రకటించారు.
🚨 ALERT – Israel – Footage of the Iron Dome missile defense.
Credits – ww3info#Israel #Palestine #War #Hamas #Rockets #Gaza #Palestinian#TelAviv #IronDome pic.twitter.com/zQHfZ3lcR9
— T R U T H P O L E (@Truthpole) October 7, 2023
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Hamas
- hamas rockets
- IDF
- Israel
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

