Zombie Virus | మనుషుల్ని జాంబీలుగా మార్చే వైరస్లు నిజమే.. 48వేల ఏండ్లుగా మంచులో బందీగా ఉన్నట్లు గుర్తించిన శాస్త్రవేత్తలు
Zombie Virus | జాంబీ.. సైన్స్‌ఫిక్షన్ హార్రర్ సినిమాల్లో మాత్రమే కనిపించే ఓ వైరస్. ఇది సోకి మనుషులు జాంబీగా మారిపోవడం.. మొత్తం మానవాళిని జాంబీలుగా మార్చేయడం చూస్తుంటే మన ఒళ్లు గగుర్పాటుకు గురవుతుంది. అయితే, భూమిపై నిజంగానే జాంబీ వైరస్లు ఉన్నట్టు తాజాగా పరిశోధకులు గుర్తించారు.
Zombie Virus | కాలిఫోర్నియా: జాంబీ.. సైన్స్‌ఫిక్షన్ హార్రర్ సినిమాల్లో మాత్రమే కనిపించే ఓ వైరస్. ఇది సోకి మనుషులు జాంబీగా మారిపోవడం.. మొత్తం మానవాళిని జాంబీలుగా మార్చేయడం చూస్తుంటే మన ఒళ్లు గగుర్పాటుకు గురవుతుంది. అయితే, భూమిపై నిజంగానే జాంబీ వైరస్లు ఉన్నట్టు తాజాగా పరిశోధకులు గుర్తించారు. 48,500 ఏండ్ల నుంచి మంచులో శాశ్వత సమాధి అయిన జాంబీ వైరస్‌కు పునరుజ్జీవం పోశారు. మంచులో బందీ అయినా అవి సోకే గుణాన్ని కోల్పోలేదని గుర్తించారు. వాతావరణ మార్పుల వల్ల ఆర్కిటిక్ ప్రాంతంలోని మంచు వేగంగా కరుగుతుండడంతో ఈ జాంబీ వైరస్ బయటపడి జంతువులతోపాటు మనుషులకూ ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్నదని కనుగొన్నారు. మానవాళికి ఇది సరికొత్త ముప్పుగా పరిణమించగలదని అంచనా వేశారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి మంచు పొరలు కరగకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన కాలిఫోర్నియాలోని నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ చీఫ్ సైంటిస్ట్ కింబర్లీ మైనర్ అభిప్రాయపడ్డారు.
ఈ వైరస్ ఎక్కడిదంటే?
గడ్డకట్టిన వైరస్లు మానవాళికి ముప్పుగా పరిణమించగలవా? అనే కోణంలో ఫ్రాన్స్‌కు చెందిన ప్రొఫెసర్ జీన్ మైకేల్ క్లావెరీ పరిశోధన ప్రారంభించారు. రష్యాలోని సైబీరియా ప్రాంతంలో మంచు నుంచి వైరస్ నమూనాలు సేకరించారు. పవర్ఫుల్ మైక్రోస్కోప్‌లతో పరిశీలించిన అనంతరం వాటికి పునరుజ్జీవం పోసి, వర్గీకరించారు. ఇదే బృందం 2014లో 30 వేల ఏండ్ల క్రితం నాటి జాంబీ వైరస్‌లను గుర్తించింది. తాజాగా, 48,500 ఏండ్ల నుంచి శీతల సమాధి అయిన వైరస్‌లను కనుగొనడంలో సఫలీకృతమైంది. ఈ వైరస్లు కల్చర్డ్ అమీబా కణాలకు సోకేగుణాన్ని కలిగి ఉన్నాయని పరిశోధకుల బృందం గుర్తించింది. అమీబా సంక్రమణ వైరస్లు చాలా ఏండ్లపాటు నిష్క్రియాత్మకంగా ఉన్నా అంటువ్యాధులను కలుగజేసే సామర్థ్యాన్ని కోల్పోవడం లేదని, ఇవి మిగతా వైరస్ల ఉత్పత్తికి కారణమవుతున్నాయని క్లావెరీ తెలిపారు. అంటే వీటి సంఖ్య అనియంత్రంగా పెరిగిపోతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: కివీస్‌తో తొలి టీ20 మ్యాచ్.. ఇండియాను గెలిపించిన నమన్ ధీర్, సంజూ శాంసన్
Amit Shah | కాంగ్రెస్ పార్టీ మరో 30 ఏళ్లు అధికారంలోకి రాదు.. రాహుల్ గాంధీపైనా అమిత్ షా విమర్శలు
Teja Sajja | పెళ్లిపీటలు ఎక్కబోతున్న ‘హనుమాన్’ హీరో తేజ సజ్జ.. ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్!
Bihar Man Arrested | అసెంబ్లీని బాంబుతో పేల్చేసినట్లు ఏఐ వీడియో.. బీహార్ వ్యక్తి అరెస్ట్
MBBS Seats: తమిళనాడు, పుదుచ్చరిలో 800 ఎంబీబీఎస్ సీట్లు ఖాళీ
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!


