Germany Recession: ఆర్థిక సంక్షోభంలోకి జర్మనీ
Germany Recession: జర్మనీలో రిసెషన్ మొదలైంది. ఆ దేశంలో ఆర్ధిక సంక్షోభంలోకి వెళ్లినట్లు ఓ ఏజెన్సీ పేర్కొన్నది. తొలి రెండు క్వార్టర్లలో ఆ దేశ పర్ఫార్మెన్స్ తగ్గింది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో జర్మనీ విఫలమైనట్లు తెలుస్తోంది.
బెర్లిన్: ప్రపంచంలోనే అతిపెద్ద నాలుగవ ఆర్ధిక వ్యవస్థగా ఉన్న జర్మనీ(Germany) ఇప్పుడు ఆర్ధిక సంక్షోభం(Recession)లోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది తొలి మూడు నెలలు ద్రవ్యోల్బణం అధికంగా ఉండడం వల్ల జర్మనీ సంక్షోభంలోకి వెళ్లినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభమైన తర్వాత జర్మనీలో గ్యాస్ సరఫరాలు మందగించాయి. దీంతో జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో ఆర్ధిక వ్యవస్థ 0.3 శాతం కుంచించుకుపోయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక ట్రేడింగ్‌లోనూ యూరో విలువ పడిపోవడంతో .. జర్మనీ మార్కెట్లో లుకలుకలు ప్రారంభం అయ్యాయి. రెండవ క్వార్టర్లో కూడా పర్ఫార్మెన్స్ తగ్గడంతో.. జర్మనీ ఆర్ధిక సంక్షోభంలోకి వెళ్తున్నట్లు స్పష్టమైంది.
ఏప్రిల్‌లో జర్మనీలో ద్రవోల్యబణం 7.2 శాతంగా ఉంది. ఇది యురో సగటు కన్నా ఎక్కువ. అధిక ధరల భారం ప్రజలపై పడింది. దీంతో ఆహారం, దుస్తులు, ఫర్నీచర్ కొనడం కోసం ప్రజలు ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చింది. అధిక ఇంధన ధరల వల్ల పరిశ్రమల ఉత్పత్తులకు ఆర్డర్లు తగ్గినట్లు గుర్తించారు. ఏడాది ఆరంభం నుంచి ధరలు అధికంగా ఉండడం వల్ల జర్మనీ ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం పడినట్లు డీస్టాటిస్ ఏజెన్సీ ఓ ప్రకటనలో తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | పంచాయతీ ఎన్నికల పోలింగ్.. కాంగ్రెస్-టీడీపీ బాహాబాహీ..!
Brain Fog | రాత్రి సరిగ్గా నిద్రించినా ఉదయం తల భారంగా ఉంటుందా.. అందుకు కారణాలు ఇవే..
Harish Rao | కేసీఆర్ దీక్షా దివస్ లేకపోతే.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడే కాదు : హరీశ్ రావు
Jagdeep Dhankhar | మాజీ ఉప రాష్ట్రపతి ధంఖర్‌కు.. ఏడాదిపైగా కేటాయించని అధికార నివాసం
తెలంగాణ ప్రజల్లో ఉద్యమ జ్వాలాను రగిలించిన రోజే దీక్ష దివస్ : రవీంద్ర కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

