డెయిర్ అల్ బాలా: ఇజ్రాయిల్, హమాస్ తీవ్రవాదల మధ్య 15 నెలలుగా జరుగుతున్న యుద్ధంలో ఇప్పటి వరకు 46 వేల మంది పాలస్తీనియన్లు(Palestinians killed) మృతిచెందినట్లు గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. 46,006 మంది మృతిచెందగా, మరో 109,378 మంది గాయపడినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. మృతుల్లో మహిళలు, చిన్నారులే సగం కన్నా ఎక్కువ మంది ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. చనిపోయిన వారిలో ఫైటర్లు కానీ పౌరులు కానీ ఎంత మంది ఉన్నారన్న విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేయలేదు.
సుమారు 17 వేల మంది మిలిటెంట్లను హతమార్చినట్లు ఇజ్రాయిల్ మిలిటరీ పేర్కొన్నది. కానీ ఆ మృతులకు ఆధారాలు చూపలేదు. పౌరులను చంపలేదని ఇజ్రాయిల్ మిలిటరీ పేర్కొన్నది. కానీ రెసిడెన్షియల్ ప్రాంతాల నుంచి హమాస్ ఆపరేట్ చేయడం వల్ల సాధారణ పౌరులు మృతిచెంది ఉంటారేమో అని తెలిపింది.
2023 అక్టోబర్ ఏడో తేదీన హమాస్ తీవ్రవాదులు .. ఇజ్రాయిల్‌పై దాడి చేసి సుమారు 1200 మందిని పొట్టనపెట్టుకున్నారు. ఆ అటాక్‌కు కౌంటర్‌గా ఇజ్రాయిల్ చేపడుతున్న యుద్ధం ఇంకా ఆగలేదు.