Woman died in Lift | మూడు రోజులపాటు లిఫ్టులో ఇరుక్కుని దుర్మరణం పాలైన మహిళ
Woman died in Lift | ఓ 32 ఏళ్ల మహిళ ఇటీవల విధుల నిమిత్తం ఓ తొమ్మిది అంతస్తుల భవనంలోని తన కార్యాలయానికి వెళ్లింది. విధులు ముగిసిన అనంతరం తిరిగి వస్తూ లిఫ్టు ఎక్కగా 9వ ఫ్లోర్‌లోనే డోర్లు మూసుకున్న అనంతరం అది ఆగిపోయింది.
తాష్కెంట్: ఓ 32 ఏళ్ల మహిళ ఇటీవల విధుల నిమిత్తం ఓ తొమ్మిది అంతస్తుల భవనంలోని తన కార్యాలయానికి వెళ్లింది. విధులు ముగిసిన అనంతరం తిరిగి వస్తూ లిఫ్టు ఎక్కగా 9వ ఫ్లోర్‌లోనే డోర్లు మూసుకున్న అనంతరం అది ఆగిపోయింది. దాంతో ఆ లిఫ్టు పనిచేయడం లేదని ఇంకెవరో యూజ్ చేయలేదు. అందులో ఓ మహిళ చిక్కుకుందనే విషయాన్ని కూడా ఎవరూ గమనించలేదు.
ఫోన్ చేసి చెప్పడానికి సదరు మహిళ దగ్గర ఉన్న ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయ్యింది. దాంతో ఆమె సాయం కోసం ఎంత అరిచిందో, ఎన్ని ఆర్తనాదాలు చేసిందో. మూడు రోజుల తర్వాత లిఫ్ట్‌ను రిపేర్ చేసేందుకు ఓపెన్ చేయగా మహిళ మృతదేహం కనిపించింది. ఉజ్బెకిస్థాన్ రాజధాని తాష్కెంట్లో ఈ హృదయ విధారక ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. తాష్కెంట్‌కు చెందిన ఓల్గా లియోన్ట్యెవా (32) విధులకు వెళ్లి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఫోన్ చేశారు. స్విచ్ఛాఫ్ వస్తుండటంతో ఎక్కడికైనా వెళ్లిందేమో వస్తుందేమో అని ఎదురు చూశారు. రెండు రోజులైనా తిరిగి రాకపోవడంతో పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెట్టారు. ఈ క్రమంలోనే ఆమె లిఫ్టులో శవమై దొరికినట్లు సమాచారం వచ్చింది. ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నదని పోలీసులు తెలిపారు. కాగా, మహిళ మరణానికి కారణమైన ఆ లిఫ్టు చైనాలో తయారైనదిగా తెలుస్తోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

