Moscow Terror Attack | మాస్కో ఉగ్రదాడి ఘటన.. కోర్టు ముందు నేరాన్ని అంగీకరించిన ఉగ్రవాదులు
Moscow Terror Attack | రష్యా (Russia) రాజధాని మాస్కోలో శుక్రవారం రాత్రి భారీ ఉగ్రదాడి (Moscow Terror Attack) జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు ముష్కరులు తాజాగా నేరాన్ని అంగీకరించారు.
Moscow Terror Attack | రష్యా (Russia) రాజధాని మాస్కోలో శుక్రవారం రాత్రి భారీ ఉగ్రదాడి (Moscow Terror Attack) జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ దాడి ఘటనలో ఇప్పటి వరకూ 11 మందిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఆ 11 మందిలో నలుగురు ఉగ్రవాదులు ఉన్నారు. ఆ నలుగురిలో ముగ్గురు ముష్కరులు తాజాగా నేరాన్ని అంగీకరించారు. దీంతో ఈ నలుగురినీ మే 22 వరకూ కస్టడీలోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.
తమ అదుపులో ఉన్న దలేర్డ్జోన్ మిర్జోయెవ్ (32), సైదాక్రమి రచబలిజోడా (30), ముఖమ్మద్సోబిర్ ఫైజోవ్ (19), షంసిదిన్ ఫరీదుని (25) ముష్కరుల్ని మాస్కోలోని బాస్మన్నీ జిల్లా కోర్టు ముందు పోలీసులు హాజరుపరిచారు. వారిలో ముగ్గరు నేరాన్ని అంగీకరించారు. సంగీత కచేరీపై తుపాకులు, బాంబులతో విరుచుపడిన వారిలో తామూ ఉన్నామని కోర్టుకు వెల్లడించారు.
కాగా, వీరిని ఆఫ్ఘానిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఇస్లామిక్ స్టేట్-ఖొరాసన్ ఉగ్రముఠాకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. ఈ నలుగురిలో ముగ్గురు కోర్టు ముందు నేరాన్ని అంగీకరించగా.. ఒకరు మాత్రం మాట్లాడలేని స్థితిలో ఉన్నట్లు తెలిసింది. అతడు విచారణ జరుగుతున్నంత సేపూ వీల్‌ఛైర్‌లో కళ్లు మూసుకొనే ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మిగిలిని ముగ్గురూ కూడా తీవ్ర గాయాలతో ఉన్నట్లు తెలిపింది.
శుక్రవారం రాత్రి ప్రముఖ రష్యన్ రాక్ బ్యాండ్ ఫిక్నిక్ సంగీత కార్యక్రమం జరుగుతున్న క్రాకస్ సిటీ కన్సర్ట్ హాల్లోకి ప్రవేశించిన దుండగులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని ఐఎస్ఐఎస్ (ISIS) ప్రకటించింది. తొలుత కన్సర్ట్ హాల్లోకి ప్రవేశించిన దుండగులు అక్కడున్నవారిపై కాల్పులు జరిపి బీభత్సం సృష్టించారు. మ్యూజిక్ షో ముగియడంతో బయటకు వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా కాల్పులు జరిపారు. అయితే ఏం జరుగుతుందో తెలియక అక్కన్నవారు సీట్ల మధ్య దాక్కున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. హాలులో చిక్కుకున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ దాడి ఘటనలో సుమారు 130 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. వంద మందికి పైగా గాయాలపాలయ్యారు.
Also Read..
Indian student | లండన్ రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్థిని మృతి
Mahakal Temple | ఉజ్జయినీ ఆలయంలో అగ్నిప్రమాదం.. పూజారులు సహా 13 మందికి..
Holi | హోలీ వేడుకల్లో అపశృతి.. మంచినీటి ట్యాంకు కూలి చిన్నారి మృతి
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pat Cummins: ఖావాజా 100 శాతం తప్పు.. అవన్నీ పిచ్చి కూతలు: ప్యాట్ కమ్మిన్స్
HIV | హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కొత్త ఔషధం.. ఏడాదికి రెండుసార్లు ఇంజెక్షన్ చాలు..
Zakir Naik: జకీర్ నాయక్‌పై నిషేధం మరో అయిదేళ్లు పొడిగింపు
Mukhra Womens Protest | హైదరాబాద్‌కు వస్తున్న రాహుల్‌గాంధీకి ముఖ్రా మహిళల నిరసన
Realme | రియల్మీ ఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. నవంబర్ 16 నుంచి కొత్త విధానం అమల్లోకి!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

