వాషింగ్టన్, జనవరి 21: ఎటుచూసినా సముద్రమే.. తినడానికి తిండి లేదు.. మాట్లాడటానికి మనిషి లేడు.. ఎగిసిపడుతున్న అలలు.. సముద్ర హోరు తప్ప ఎక్కడున్నామో తెలియదు.. ఇలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి చిన్న బోటులో 24 రోజులు సహాయం కోసం ఎదురుచూసి ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడ్డాడు. డొమినికాకు చెందిన ఎల్విస్ ఫ్రాంకోయిస్ (47) బోటు రిపేర్ చేస్తుండగా కొట్టుకుపోయింది. దాంతో పాటే అతడూ కొట్టుకుపోయాడు. నావిగేషన్‌పై అనుభవం లేకపోవటంతో కరేబియన్ సముద్రంలో నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. అయితే, పైనుంచి చూసిన కొలంబియన్ ఎయిర్‌క్రాఫ్ట్ సిబ్బంది అతడిని రక్షించారు. తన సెయిల్ బోటుపై అతడుంచిన ‘రక్షించండి’ అన్న బోర్డు చూసి కాపాడిన నేవీ సిబ్బంది అతడిని ఒడ్డుకు చేర్చారు. తర్వాత చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. 24 రోజులు కెచప్‌ను కొద్దికొద్దిగా తిని ప్రాణాలు నిలుపుకొన్నట్టు బాధితుడు తెలిపాడు. ఒక సమయంలో జీవితంపై ఆశ వదులుకున్నానని, ఆ సమయంలో తనకు కుటుంబమే గుర్తుకు వచ్చిం దని, నిజంగా అవి భయంకరమైన పరిస్థితులని తెలిపాడు.