భారీ వర్షాలకు 21 మంది మృతి.. డజన్ల కొద్ది గల్లంతు
గల్లంతు| అమెరికాలోని టెన్నెస్సీలో భారీ వర్షాలకు 21 మంది మృతిచెందారు. డజన్ల సంఖ్యలో తప్పిపోయారు. టెన్నిస్సీలోని హప్రేస్ కౌంటీలో శనివారం వర్షం ముంచెత్తింది. శనివారం ఒకేరోజు 38 సెంటీమీటర్ల (15 ఇంచులు) వాన కురిసిందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో వరదల తాకిడికి స్థానిక రోడ్లు, హైవేలు, బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి.

వాషింగ్టన్: అమెరికాలోని టెన్నెస్సీలో భారీ వర్షాలకు 21 మంది మృతిచెందారు. డజన్ల సంఖ్యలో తప్పిపోయారు. టెన్నిస్సీలోని హప్రేస్ కౌంటీలో శనివారం వర్షం ముంచెత్తింది. శనివారం ఒకేరోజు 38 సెంటీమీటర్ల (15 ఇంచులు) వాన కురిసిందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో వరదల తాకిడికి స్థానిక రోడ్లు, హైవేలు, బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. సుమారు 21 మంది మరణించారు. డజన్ల కొద్ది మంది గల్లంతయ్యారని దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. మొదట 40 మందికిపైగా తప్పిపోయారని సమాచారం తమకు అందిందని, అయితే వారిలో 20 మంది ఆచూకీ లభించిందని అధికారులు పోలీసులు తెలిపారు. టెన్నెస్సీ చరిత్రలో ఇంత భారీ వర్షం నమోదవడం, వరదలు సంభవించడం ఇదే మొదటిసారని చెప్పారు. వరదల ధాటికి భారీ సంఖ్యలో వాహనాలు కొట్టుకుపోయాయని, చాలా ప్రాంతాలు నీట మునిగాయని వెల్లడించారు. తప్పిపోయినవారికో గాలింపు కొనసాగుతున్నదని వెల్లడించారు.

Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

