స్టాక్‌హోమ్: 2026 నోబెల్ సాహిత్య అవార్డును ప్రకటించారు. కెనడా రచయిత్రి అన్నే కార్సన్‌ను ఆ బహుమతి వరించింది. సాహిత్యంలో ఆమె కొత్త ప్రక్రియకు బీజం వేశారు. సమాకాలీన సాహిత్యంలో కొత్త ఒరవడి సృష్టించారు. అన్నే కార్సన్ 1950లో టొరంటోలో జన్మించారు. 1981లో ఓడీ ఎట్ ఆమో ఎర్గో సమ్ థీసిస్‌ను ఆమె డాక్టరేట్ కోసం ప్రజెంట్ చేశారు. 1990లో ఆమె ఓ సిరీస్‌ను పబ్లిష్ చేశారు. ద గ్లాసీ ఎస్ఏ, గ్లాస్, ఐరనీ, గాడ్ అనే రచనలు చేశారు. దాంట్లో ఆమె సుదీర్ఘ కవిత్వ రచన చేశారు. 1998లో ఆటోబయోగ్రఫీ ఆఫ్ రెడ్.. ఏ నావెల్ ఇన్ వర్స్ అనే నవల రాశారామె. లైట్ టచ్‌తో ఆమె కథలు రాస్తూ.. రచనా శైలిలో కొత్త పోకడలు వెతికారు. దీంతో ఆమె సాహిత్య ప్రక్రియపై ఆసక్తి పెరిగింది. హాస్యం, వ్యంగాన్ని కూడా తన రచనల్లో చూపారామె. ద బ్యూటీ ఆఫ్ ద హజ్బెండ్.. ఏ ఫిక్షనల్ ఎస్సీ ఇన్ 29 టాంగోస్ను 2001లో పబ్లిష్ చేశారు. తన భర్త గురించి ఆమె 29 ఎపిసోడ్లు రాశారు. జాక్ కీట్స్ సాహిత్య చమక్కులను వాడుతూ ఆమె ఆ కథనాలు రాశారు. తన సోదరుడి జ్ఞాపకార్ధం నాక్స్ అనే రచన చేశారు.
Anne Carson – awarded the 2026 #NobelPrize in Literature – once described boredom as her arch-enemy. It is a state she confronts with drastic humour and wit.
‘The Beauty of the Husband: A Fictional Essay in 29 Tangos’, published in 2001, tells of a cutting and sardonic row with a deceitful husband, its twenty-nine episodes each opening with lines of verse by the romantic poet John Keats. Keats’s sublime words about beauty being truth are, in brutal yet playful fashion, juxtaposed with this exhausting relationship drama.
— The Nobel Prize (@NobelPrize) October 8, 2026
1901 నుంచి 118 సార్లు సాహిత్య నోబెల్ బహుమతి ప్రకటించారు. ఇప్పటి వరకు 122 మంది రచయితలు సాహిత్య నోబెల్ అందుకున్నారు. 87 ఏళ్ల వయసులో డోరిస్ లెస్సింగ్ అవార్డు స్వీకరించారు. నాలుగు సార్లు సాహిత్య నోబెల్‌ను ఇద్దరిద్దరు పంచుకున్నారు. స్టాక్‌హోమ్‌లోని స్వీడిష్ అకాడమీ సాహిత్య అవార్డును ప్రకటిస్తుంది.