స్టాక్‌హోమ్: ఈ ఏడాది రసాయన శాస్త్రంలో ఇద్దరు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి దక్కింది. హెన్రీ బీ కగన్, కెన్సో సోయిలను అవార్డు వరించింది. ఫార్మసీ ఉత్పత్తులకు అవసరమైన రియాక్షన్ డిజైన్లను ఇద్దరు కెమిస్ట్‌లు రూపొందించినట్లు నోబెల్ కమిటీ తన ప్రకటనలో పేర్కొన్నది.
BREAKING NEWS
The Royal Swedish Academy of Sciences has decided to award the 2026 #NobelPrize in Chemistry to Henri B. Kagan and Kenso Soai “for the discovery of non-linear effects and autocatalysis in asymmetric organic synthesis.” https://t.co/nH090ql1Xc— The Nobel Prize (@NobelPrize) October 7, 2026
ఫ్రెడ్రిక్ సాంజర్, బ్యారీ షార్ప్‌లెస్‌కు రెండు సార్లు కెమిస్ట్రీ అవార్డు. స్టాక్‌హోమ్‌లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఈ అవార్డును ప్రదానం చేస్తుంది.1901 నుంచి ఇప్పటి వరకు 117 సార్లు రసాయన శాస్త్రంలో నోబెల్ అవార్డులు ఇచ్చారు. 198 మంది కెమిస్ట్రీలో అవార్డు తీసుకున్నారు. 35 ఏళ్ల వయసులో ఫ్రెడ్రిక్ జోలియట్ కెమిస్ట్రీ అవార్డు అందుకున్నారు. 97 ఏళ్ల వయసులో జాన్ బీ గుడ్ఎనాఫ్ ఈ అవార్డును స్వీకరించారు.