US Hindu Temple: అమెరికా గుడిలో కాల్పులకు ప్లాన్.. గన్ జామ్ కావడంతో తప్పిన ముప్పు.. టీనేజర్ అరెస్టు
US Hindu Temple : అమెరికాలోని హిందూ ఆలయం వద్ద సామూహిక కాల్పుల దాడికి ఓ టీనేజర్ ప్రయత్నించాడు. కానీ అతని రైఫిల్ జామ్ కావడం వల్ల అక్కడ ప్రాణ నష్టం జరగలేదు. ఈ కేసులో 18 ఏళ్ల అలెగ్జాండ్రోస్ పాపోరకిస్ను అరెస్టు చేశారు.
న్యూయార్క్: అమెరికాలోని ఇలియనాస్ రాష్ట్రంలో ఉన్న ఓ హిందూ ఆలయం(US Hindu Temple) వద్ద సామూహిక కాల్పులకు ఓ టీనేజర్ ప్రయత్నించాడు. అయితే అతని రైఫిల్ జామ్ కావడం వల్ల అక్కడ ప్రాణ నష్టం జరగలేదు. చికాగో సమీపంలో అరోరాలో ఉన్న ఆలయంలో ఈ ఘటన జరిగింది. సామూహిక కాల్పుల దాడికి ప్లాన్ చేసిన వ్యక్తిని 19 ఏళ్ల అలెగ్జాండ్రోస్ పాపోరకిస్గా గుర్తించారు. పాలలైన్ గ్రామానికి చెందిన అతన్ని అక్టోబర్ 11వ తేదీన అదుపులోకి తీసుకున్నారు. ఉన్మాదిగా మారిన అతని వద్ద నుంచి ఓ డాక్యుమెంట్‌ను సేకరించారు. అక్రమ రీతిలో ఆయుధం కలిగినందుకు, ఉగ్రవాది తరహాలో బెదిరింపులకు పాల్పడినందుకు అతనిపై కేసులు నమోదు చేశారు.
ఆరోరా సిటీలో ఉన్న గుడిలో ఫైరింగ్ చేయాలని అలెగ్జాండ్రోస్ భావించాడు. కానీ అతని ప్లాన్ వర్కౌట్ కాలేదు. అతని గన్ జామ్ కావడం వల్ల, అతను మళ్లీ ఇంటికి వెళ్లిపో్యాడు. నిందితుడి నుంచి తీవ్రవాద భావజాలం, శ్వేతజాతి ఆధిపత్యానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. దక్షిణాసియా ప్రజలపై హింసకు పాల్పడాలని అతని వద్ద ఉన్న డాక్యుమెంట్లలో ఉన్నట్లు గుర్తించారు. భారతీయులపై దాడి చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులను చికాగోలోని కౌన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రశంసించారు.
ఆ ఆలయంలో ప్రస్తుతం దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇక రెండు వారాల క్రితమే ఓహియోలోని శ్రీ స్వామి నారాయణన్ వడ్తల్ ధామ్ హిందూ మందిర్‌ను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. నిందిత వ్యక్తి అలెగ్జాండ్రోస్ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ టాకో బెల్లో క్యాషియర్‌గా చేస్తున్నారు. గత ఆదివారం అరోరా టెంపుల్లోని హిందువులను టార్గెట్ చేయాలని భావించాడు. ఆ రోజున ఆలయంలో జనం కూడా ఎక్కువే ఉన్నారు. అతని వద్ద ఏఆర్ స్టయిల్ రైఫిల్‌తో పాటు 300 రౌండ్ల అమ్యూనిషన్ ఉందని, వీటితో పది మ్యాగ్జిన్లను రీలోడ్ చేయవచ్చు అని ఓ రిపోర్టులో తెలిపారు.
According to the latest reporting, the heavily armed gunman was already at the Hindu temple and attempted to start shooting, but the gun jammed.
The man described himself as a “sociopathic white supremacist Neo-Nazi filled with hatred, fantasizing about mass murder nearly every day.”
Very disturbing details here:
https://t.co/G2aN90yTu8— Hindu American Foundation (@HinduAmerican) October 15, 2026
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
Dasara holidays | గతంలో 10 రోజులు సెలవులు.. ఇప్పుడు కేవలం రెండు రోజులే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

