New York | అమెరికాకు వలసల చిక్కులు.. న్యూయార్క్‌ను నాశనం చేస్తున్న మానవతా వైఖరి: మేయర్ ఎరిక్ ఆడమ్స్
అమెరికా వెళ్లాలని ప్రపంచంలోని చాలా మంది కలలు కంటుంటారు. ఈ కలే ఆ దేశానికి చిక్కులు తెచ్చిపెడుతున్నది. అక్కడ లభించే సౌకర్యవంతమైన జీవితం, అపార ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రతి ఏడాది లక్షలాది మంది అధికారికంగా ఆ దేశానికి క్యూ కడుతున్నారు.
New York | న్యూయార్క్, అక్టోబర్ 6: అమెరికా వెళ్లాలని ప్రపంచంలోని చాలా మంది కలలు కంటుంటారు. ఈ కలే ఆ దేశానికి చిక్కులు తెచ్చిపెడుతున్నది. అక్కడ లభించే సౌకర్యవంతమైన జీవితం, అపార ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రతి ఏడాది లక్షలాది మంది అధికారికంగా ఆ దేశానికి క్యూ కడుతున్నారు. అయితే వీరికి తోడు అక్రమ వలసదారులు కూడా పెద్ద ఎత్తున చొరబడుతుండటం ఆ దేశ అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. ముఖ్యంగా న్యూయార్క్ నగరంలో అక్రమ వలసదారులకు ఆవాసం కల్పించడం అధికారులకు సమస్యగా మారింది. గత ఏడాది న్యూయార్క్‌లో 1,18,000 మంది అక్రమ వలసదారులు రాగా, వీరిలో 60 వేల మంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్లలో ఉంటున్నారు. అయితే వీరి ఇతర అవసరాలను తీర్చడం అధికారులకు ఇబ్బందిగా మారింది. తమ మానవతా వైఖరి న్యూయార్క్ నగరాన్ని నాశనం చేస్తున్నదని మేయర్ ఎరిక్ ఆడమ్స్ వ్యాఖ్యానించారు.
నిండిపోతున్న షెల్టర్లు
సాధారణంగా దక్షిణ అమెరికా, పశ్చిమ ఆఫ్రికా దేశాలకు చెందిన వలసదారులు ఇక్కడకు అధికంగా వస్తున్నారు. వీరికి స్కూల్ జిమ్‌లు, బడ్జెట్ హోటల్స్, పార్కింగ్ ప్రదేశాలు తదితరమైనవి ఆవాసాలుగా కేటాయిస్తున్నారు. అయితే ఇప్పుడు అవి కూడా నిండిపోవడంతో నగరానికి పెద్ద సమస్యగా మారింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- America
- New York
- New York City
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

