WHO | ఇంకా తొలగని కరోనా ముప్పు.. డిసెంబర్లో 10 వేల మంది మృతి: డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్
ప్రపంచానికి కరోనా (COVID-19) ముప్పు ఇంకా తొలగిపోలేదని, ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ టెడ్రోస్ అథనామ్ ఘెబ్రెయెస్ అన్నారు.
న్యూయార్క్: ప్రపంచానికి కరోనా (COVID-19) ముప్పు ఇంకా తొలగిపోలేదని, ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ టెడ్రోస్ అథనామ్ ఘెబ్రెయెస్ (Tedros Adhanom Ghebreyesus) అన్నారు. ప్రపంచ దేశాల్లో పాక్షికంగా ప్రబలుతున్న కొవిడ్ పెద్ద ముప్పుగా మారిందని చెప్పారు. ఒక్క డిసెంబరు నెలలోనే కరోనా మహమ్మారి వల్ల 10 వేలమందికిపైగా మరణించారని తెలిపారు. క్రిస్మస్ (Christmas) సెలవుల కాలంలో కొవిడ్ జేఎన్.1 వేరియంట్ అధికంగా వ్యాప్తి చెందిందని వెల్లడించారు. దీని ప్రభావం అమెరికా, యూరప్ దేశాల్లో అధికంగా ఉందన్నారు.
ఈ వైరస్ వల్ల గతేడాది నవంబర్ నెలలో దవాఖానల్లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేరిన వారి సంఖ్య 42 నుంచి 62 శాతానికి పెరిగిందని ఆందోళన వ్యక్తంచేశారు. కొవిడ్ వైరస్ పట్ల అన్ని దేశాలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా పరీక్షలు, చికిత్సలు, వ్యాక్సిన్లకు ప్రాధాన్యమివ్వాలని ప్రభుత్వాలను కోరారు. వైరస్‌పై నిఘా వేసి సీక్వెన్సింగ్ నిర్వహించాలన్నారు. మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు టీకాలు వేయించుకోవాలని, పరీక్షలు చేయించుకోవడంతోపాటు ముందుజాగ్రత్తగా మాస్కులు ధరించాలన్నారు. 2019లో కరోనా వైరస్‌ను చైనాలోని వుహాన్‌లో గుర్తించిన విషయం తెలిందే. రెండేండ్లు ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి.. క్రమంగా వ్యాప్తి తగ్గిపోయింది. దీంతో 2023, మే నెలలో కొవిడ్-19 అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి ముగిసినట్లు డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

