న్యూఢిల్లీ: కాంబోడియాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. పోయిపెట్లోని గ్రాండ్ డైమండ్ సిటీ క్యాసినో హోటల్లో బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి బిల్డింగ్ మొత్తానికి వ్యాపించాయి. దీంతో 10 మంది సజీవ దహనమయ్యారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ที่นั่น..#ปอยเปต
23:10น. เหตุไฟไหม้
ในส่วนห้องครัวชั้นล่างของ Grand Diamond City Casino &Resort น่าจะไฟฟ้าลัดวงจร ลามถึงชั้นบน เกิดกลุ่มควันไฟชั้นบน นักพนันหนีตายกันอลหม่าน บางคนยังติดอยู่ชั้นบน สำลักควันกัน ขอความช่วยเหลืออยู่ ขอให้ปลอดภัยทุกๆคน #กัมพูชา#โหนกระแส pic.twitter.com/Cg76a96Zo1— ตะละแม่บุษบง (@MY_1428_V2) December 28, 2022
మంటలు భారీగా ఎగసిపడటంతో వాటిని అదుపుచేయడానికి అగ్నిమాపక సిబ్బంది కష్టపడాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను థాయ్‌లాండ్‌లోని సా కాయో ప్రావిన్స్‌లో ఉన్న దవాఖానకు తరలించామన్నారు. కొందరు బిల్డింగ్ కిటికీల్లో నుంచి కిందికి దూకి ప్రాణాలు కాపాడుకున్నారని చెప్పారు. థాయ్‌లాండ్-కాంబోడియా సరిహద్దుల్లో ఉన్న డైమండ్ సిటీ క్యాసినోలకు ప్రసిద్ధి.