కరోనా దవాఖానలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి
కరోనా దవాఖాన | ఐరోపా దేశమైన ఉత్తర మెసిడోనియా ఘోర ప్రమాదం జరిగింది. బాల్కన్ కౌంటీలోని టెటోవో నగరంలో ఉన్న ఓ కరోనా దవాఖానలో మంటలు చెలరేగాయి. దీంతో పది మంది సజీవదహణమయ్యారు.

హైదరాబాద్: ఐరోపా దేశమైన ఉత్తర మెసిడోనియా ఘోర ప్రమాదం జరిగింది. బాల్కన్ కౌంటీలోని టెటోవో నగరంలో ఉన్న ఓ కరోనా దవాఖానలో మంటలు చెలరేగాయి. దీంతో పది మంది సజీవదహణమయ్యారు. పలువురు గాయపడ్డారు. కరోనా కేసులు భారీగా పెరగడంతో ఈ తాత్కాలిక దవాఖానను ఏర్పాటు చేశారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, క్షతగాత్రులతో పాటు మరికొందరు రోగులను ఇతర దవాఖానలకు తరలించామని అధికారులు వెల్లడించారు.
కాగా, అగ్నిప్రమాదానికి సంబంధించి కారణాలు ఇంకా తెలియలేదన్నారు. అయితే, ఓ పేలుడు తర్వాత మంటలు సంభవించినట్లు ఆ దేశ ప్రధాని జొరాన్ జాయెవ్ ఫేస్బుక్ పోస్ట్‌లో వెల్లడించారు. ఆగస్టు నుంచి ఉత్తర మెసిడోనియాలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రతిరోజు 30 మంది బాధితులు మరణిస్తున్నారు. దేశంలో ఇప్పటివరకు 6100 మంది మృతిచెందారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhu Bharati | సర్వర్ డౌన్.. ఓటీపీలు రావు.. భూ భారతి సేవలతో రైతుల అవస్థలు
Graduate Voter Registration | ఓటు నమోదులో వెనుకబడ్డ పట్టభద్రులు.. ఆన్లైన్లో అవకాశమున్నా ఎందుకింత నిరాసక్తత?
Fauzi | ‘ఫౌజీ’ నుంచి క్రేజీ అప్డేట్.. ‘ఎవరతను?’ అంటూ ఆసక్తి పెంచిన మేకర్స్!
Hyderabad | హైదరాబాద్‌లో ట్యాంకర్లకు డిమాండ్.. రోజుకు 7 వేలు దాటిన బుకింగ్స్.. నీటికొరతతో అల్లాడుతున్న జనం
Bigg Boss 10 | రూల్స్ మార్చేసిన బిగ్‌బాస్.. తనకు అన్యాయం జరిగిందంటూ నరేష్ కన్నీళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

