ప్రపంచంలోనే తేలికైన పెయింట్
ప్రపంచంలోనే తేలికైన పెయింట్‌ను అమెరికాలోని సెంట్రల్ ఫ్లోరిడా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు తయారుచేశారు. ఎలాంటి రంగు లేకుండా ఉండే ఈ ప్లాస్మోనిక్ పెయింట్‌ను ఏ రంగులోకి అయినా సులువుగా మార్చుకోవచ్చని, ఇది వందల ఏండ్ల పాటు అలాగే ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
వాషింగ్టన్, ఏప్రిల్ 4: ప్రపంచంలోనే తేలికైన పెయింట్‌ను అమెరికాలోని సెంట్రల్ ఫ్లోరిడా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు తయారుచేశారు. ఎలాంటి రంగు లేకుండా ఉండే ఈ ప్లాస్మోనిక్ పెయింట్‌ను ఏ రంగులోకి అయినా సులువుగా మార్చుకోవచ్చని, ఇది వందల ఏండ్ల పాటు అలాగే ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న పెయింట్ల తయారీకి భిన్నమైన రసాయనాలను వినియోగించి దీనిని తయారుచేశారు. ఈ పెయింట్‌ను తయారుచేసిన బృందానికి యూనివర్సిటీలోని నానోసైన్స్ టెక్నాలజీ సెంటర్ ప్రొఫెసర్ దెబాశిస్ చందా నేతృత్వం వహించారు.
సీతాకోకచిలుకలను స్ఫూర్తిగా తీసుకొని ఈ పెయింట్‌ను తయారుచేసినట్టు ఆయన తెలిపారు. కేవలం లోహాలు, ఆక్సైడ్లను ఉపయోగించి తయారుచేసిన ఈ పెయింట్ పర్యావరణహితమైనదని పేర్కొన్నారు. సాధారణ పెయింట్‌తో ఒక బోయింగ్ 747 విమానానికి పెయింట్ వేయడానికి 400 కిలోలు అవసరం పడుతుందని, తాము తయారుచేసిన ప్లాస్మోనిక్ పెయింట్ అయితే కేవలం ఒక్క కిలో సరిపోతుందని తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

