జూ నిర్వాహకుడిపై పెద్ద పాము దాడి.. వీడియో వైరల్

వాషింగ్టన్: ఒక జూ నిర్వాహకుడిపై పెద్ద పాము దాడి చేసింది. అయితే ఆయన దాని దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన జే బ్రూవర్ అనే వ్యక్తి స్నేక్ జూను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో భయంకరమైన సర్పాలతో కూడిన వీడియోలను ఆయన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తుంటారు. బ్రూవర్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియో ఒళ్లు జలదరింప జేస్తున్నది. ఒక పెద్ద పాము ఆయనపై దాడి చేయగా తృటిలో తప్పించుకున్నారు. ‘వావ్! ఈ పాము ఎంత స్మార్ట్‌గా వ్యవహరించిందో చూడండి? నా దృష్టి దాని పైనుంచి పక్కకు మళ్లిన మరుక్షణమే ఎలా దాడి చేసిందో చూశారా’ అని అందులో బ్రూవర్ వ్యాఖ్యానించారు.
మరోవైపు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఇప్పటికే 9 లక్షల మందికిపైగా దీనిని వీక్షించారు. వెయ్యి మందికిపైగా నెటిజన్లు కామెంట్లు చేశారు. ‘మీరు తృటిలో తప్పించుకున్నారు.. లేకపోతే మీ ముఖంపై పాము కాటు వేసేది’ అని కొందరు వ్యాఖ్యానించారు.
https://www.instagram.com/p/CMZq-XJFmvj/?utm_source=ig_web_copy_link
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

