సిటీబ్యూరో, జూలై 4(నమస్తే తెలంగాణ): నగరంలో వినోదాత్మక పార్క్ చైన్‌ను కలిగి ఉన్న వండర్లా ఆన్లైన్ టికెట్లపై ఆఫర్‌ను ప్రకటించింది. సందర్శకుల కోసం ఆన్లైన్ టికెట్లపై 25 శా తం ఆదా చేసుకునే అవకాశాన్ని కల్పించినట్లు వండర్ లా హాలిడేస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కె.చిట్టిలప్పి ల్లి పేర్కొన్నారు. ప్రతి బుధవారం ఈ ఆఫర్ వర్తిస్తుందని, మొదటి 1000 ఆన్లైన్ టికెట్లకు మాత్రమే ఈ అవకా శం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్, బెంగళూరుతో పాటు కొచ్చిలోని మూడు పార్కుల్లో మాత్ర మే ఈ ప్రత్యే క ఆఫర్ చెల్లుబాటు అవుతుందని చె ప్పారు. సందర్శకులు ఆన్లైన్ పోర్టల్ https://bookings. wonderla. com/ ద్వారా తమ ఎంట్రీ టికెట్లను బుక్ చేసుకోవచ్చని సూచించారు.