HomeHyderabadWomen Development Child Welfare Commissioner Divya Devarajan
దత్తత చట్టపరంగా జరగాలి
చట్టపరంగానే పిల్లలను దత్తత తీసుకోవాలని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్యాదేవరాజన్ అన్నారు
వారం రోజుల్లో దత్తత హెల్ప్ డెస్క్ ప్రారంభం
మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్యారాజన్
వెంగళరావునగర్, నవంబర్ 25 : చట్టపరంగానే పిల్లలను దత్తత తీసుకోవాలని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్యాదేవరాజన్ అన్నారు. శుక్రవారం మధురానగర్‌లోని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం ప్రాంగణంలోని ట్రాన్సిట్ హాల్లో జరిగిన అంతర్జాతీయ దత్తత మాసోత్సవాల కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దవాఖానలు, నర్సింగ్ హోమ్‌ల వద్ద పిల్లలను దత్తతకు తీసుకోవడం నేరమని, సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ అథారిటీ (కారా) www.cara.nic.in ద్వారా దత్తత తీసుకోవాలని సూచించారు. దత్తత ప్రాసెసింగ్ సమయాన్ని తగ్గించేందుకు చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు. వారం రోజుల్లో హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.
అనంతరం దత్తత అవగాహన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రీజనల్ జాయింట్ డైరెక్టర్ శారద, అసిస్టెంట్ డైరెక్టర్ పద్మజ రమణ, స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ చైర్పర్సన్ శ్రీనివాస్‌రావు, సభ్యులు శోభ, దేవయ్య, బృందాదర్ రావు, అపర్ణ, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల సీడబ్ల్యూసీ చైర్పర్సన్లు, వేర్ ఆర్ ఇండియన్ చిల్డ్రన్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ మీరా, తదితరులు పాల్గొన్నారు.