వివాహం.. మధుర జ్ఞాపకం
బాజాలు మోగాలంటే ముహూర్తం చూడాల్సిందే. మంచి ఘడియల వేళ ఒక్కటవ్వాలని చాలా మంది విశ్వాసం. అందుకే ముహూర్తాలు చూసుకొని లగ్గం నిశ్ఛయించుకుంటారు.
- కల్యాణం.. కలకాలం గుర్తుండేలా..
- నగరంలో నిత్యనూతనంగా వివాహ వేడుకలు
- పెళ్లి చూపుల నుంచి రిసెప్షన్ వరకు ప్రతీది ప్రత్యేకం
- సాంకేతిక పరిజ్ఞానానికే అధిక ప్రాధాన్యం
- సినిమా సెట్టింగ్‌ల మాదిరిగా పెళ్లి మండపాలు
- విభిన్న కాస్ట్యూమ్స్.. డ్రోన్ కెమెరాలతో వీడియోలు
- ముహూర్తాలు తక్కువ.. వివాహాలు ఎక్కువ
జీవితంలో ఓ అపురూప ఘట్టం వివాహం.. పచ్చని తోరణాలు.. ముత్యాల పందిరి.. వేద మంత్రాలు.. జీలకర బెల్లం.. మంగళ వాయిద్యం.. మూడు ముళ్లు.. ఏడు అడుగులు.. సౌభాగ్య వైభోగం.. బంధు జన సంద్రం.. పెద్దల ఆశీస్సులతో జంటలు ఒక్కటయ్యే మధుర జ్ఞాపకం. ఇందుకు శుభ ఘడియలు వచ్చేశాయ్..!
సిటీబ్యూరో, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): బాజాలు మోగాలంటే ముహూర్తం చూడాల్సిందే. మంచి ఘడియల వేళ ఒక్కటవ్వాలని చాలా మంది విశ్వాసం. అందుకే ముహూర్తాలు చూసుకొని లగ్గం నిశ్ఛయించుకుంటారు. కాగా ఫిబ్రవరి, మే నెలల్లో పెళ్లి ముహూర్తాలు పరిమితంగానే ఉన్నా.. వివాహాలు జరిగేవి మాత్రం అధికంగా ఉన్నాయని పండితులు చెబుతున్నారు. సుముహూర్తాల రోజున నగరంలో పెళ్లి సందడి నెలకొంటుంది. పెండ్లి చూపుల్లో కలిసిన మనసులు.. చివరికి ఒక్కటయ్యే వరకు అన్నింటిలోనూ టెక్నాలజీదే పైమెట్టు. వాట్సాప్ సందేశాలు, త్రీడీ తెరపై సంబురాలు, వింధు, వినోదాలు, అలంకరణల్లోనూ సృజనాత్మకత చాటుతూ వివాహాలు జరుపుకుంటున్నారు. అటు సంప్రదాయానికి సై అంటూనే.. క్రియేటివిటీని జోడిస్తున్నారు. తమ అభిరుచులు, హోదాలను ప్రతిబింభించేల వివాహాలు జరుపుకుంటున్నారు.
ఒక్క క్లిక్‌తోనే సమాస్తం..
గతంలో పెళ్లంటే సవాలక్ష సవాళ్లు. అతిథులను పిలవాలన్నా వేల కిలో మీటర్ల ప్రయాస. ప్రతీ చిన్న పనికి కాళ్లరిగేల తిరగాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు టెక్నాలజీతోనే అంతా చక్కబెట్టేస్తున్నారు. ఆహ్వాన పత్రిక నుంచి పెళ్లి తంతు వీక్షించే వరకు సాంకేతికతకు పెద్దపీట వేస్తున్నారు. సోషల్ మీడియా ఆహ్వానాలు పెద్ద ఎత్తున సక్సెస్ అవుతున్నాయి. సరికొత్త సాఫ్ట్వేర్ సాయంతో రూపొందించిన ఆహ్వానపత్రికను వాట్సాప్ ద్వారానే బంధువులకు పంపుతున్నారు. లింక్‌ను క్లిక్ చేస్తే చాలు.. వారు స్వాగతం పలుకుతున్నట్టుగా దర్శనమిస్తారు. చక్కటి సంగీతం, భావోద్వేగాలను మలిచే వీడియో గ్రాఫర్లు, వేదపండితుల మంత్రోచ్ఛారణలు.., డ్రోన్ కెమెరాలతో ప్రీవెడ్డింగ్ షూట్స్, సినిమా సెట్టింగ్స్‌ను మరిపించే పందిళ్లను తీర్చిదిద్దుతున్నారు. కాస్ట్యూమ్స్ విషయంలోనూ తగ్గడంలేదు. ఇతర రాష్ర్టాలు, ఇతర దేశాల్లోనూ జరుపుతున్న వివాహ వేడుకలకు హాజరుకాలేని వారు వీక్షించేల లింక్‌లను అందుబాటులో ఉంచుతుండటం విశేషం.
అభిరుచులకు తగ్గట్టుగా..
స్వాగత ద్వారం, పెళ్లి మండపం, వింధు భోజనం ఇలా ప్రతిదీ కొత్తగా ఉండేల చూడాలి. ఒకే వేడుకలో ఎన్నో వైవిధ్యాలను ఆశిస్తున్నారు. ఇంద్రజాల ప్రదర్శన, హాస్య స్కిట్లు, సంగీత కార్యక్రమాలు ఇలా అన్నీ ఉండేల చూసుకుంటున్నారు. మండపానికే వారు ఎక్కువగా సమయం తీసుకుంటారు. జైపూర్, జోధ్‌పూర్, గోవా, థాయ్‌లాండ్ తదితర చోట్ల పెండ్లీలు నిర్వహించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. సినిమా సెట్టింగులు అలంకరించే వారికి అవకాశం ఇస్తున్నారు.
– ప్రభా చౌదరి, సీఈఓ, పెరల్ మార్వెల్ ఈవెంట్స్
పెళ్లి అయ్యే వరకు వారింట్లోనే..!
పెళ్లి తంతులో అలంకరణది ప్రధాన పాత్ర. వధూవరులను మరింత అందంగా చూపించాల్సి ఉంటుంది. అందుకు అనేక పద్ధతులు పాటిస్తాం. మెహిందీ నుంచి పార్లర్ సర్వీస్ వరకు కొత్తగా ఉండేల చూడాలి. కళ్యాణానికి సంబంధించిన డిజైన్లు అనేకం ఉంటాయి. అరచేతిలో కూడా పెళ్లి తంతు చిత్రాలతో ఆకట్టుకునేల ప్లాన్ చేస్తాం. కాబోయే దంపతుల పేర్లలో మొదటి అక్షరాలను కలిపి డిజైన్ చేస్తాం. అయితే అలంకరణ అనేది ఒకప్పుడు పెళ్లిపీటలు ఎక్కే సమయంలోనే ఉండేది. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్లోనే విభిన్న రకాల కాస్ట్యూమ్స్‌తో అనేక రకాల మేకప్ ైస్టెల్స్‌తో వారిని రెడీ చేయాల్సి ఉంటుంది. పెళ్లి అయ్యే వరకు వారింట్లోనే ఉండాల్సి వస్తుంది. ప్రస్తుతం వెడ్డింగ్ కల్చర్‌లో టెక్నాలజీ సాయంతో ఇచ్చే ఎఫెక్ట్స్‌కే క్రేజ్ ఎక్కువగా ఉంది.
– తేజస్విని, బ్యుటీషియన్ ఎక్స్పర్ట్
ప్రత్యేక లోగోతో పెళ్లి బహుమతులు
మా స్నేహితుడి వివాహానికి మేము సైకిల్ లోగోను గిఫ్ట్‌గా అందించాం. ఇటీవల ఈ ట్రెండ్ పెరిగింది. సంబంధిత రంగాలకు చెందిన లోగోలను తయారుచేసి బహుమతులుగా అందిస్తున్నారు. ఆహ్వానపత్రిక నుంచి స్వాగతద్వారం, చేతికిచ్చే బహుమతి వరకు ప్రత్యేకంగా ఉండాలని భావిస్తున్నారు. ఆరోగ్యం ఉండాలనే కాన్సెప్ట్‌తో సైకిళ్లను బహుమతిగా ఇస్తున్న ట్రెండ్ ఇటీవల పెరిగింది.
– రవి సాంబరి, ఐటీ ఉద్యోగి. సైక్లిస్టు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Para Swimmer Aalam Shaikh: హోటల్లో మహిళా సిబ్బందితో అనుచిత ప్రవర్తన.. భారత పారా స్విమ్మర్ డిపోర్ట్
Ranabaali | ‘జైలర్ 2’ను దాటేసిన ‘రణబాలి’.. నైజాంలో విజయ్ దేవరకొండ సినిమా జోరు!
Sonia Gandhi: ఇన్‌స్టాగ్రామ్‌లోకి సోనియా గాంధీ.. ఫాలోఅవుతున్న కాంగ్రెస్ నేతలు
Resign | టీడీపీకి భారీ షాక్ ..వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
Mouli | న్యూస్ ఛానెల్ వాళ్లు బ్లాక్మెయిల్ చేశారు.. అనారోగ్యంతో ఉన్నా వెళ్లక తప్పలేదు: మౌళి
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

