ఇంకుడు గుంతల నిర్మాణాలపై జలమండలి సర్వే
వాటర్ ట్యాంకర్ల డిమాండ్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఇంకుడు గుంతల నిర్మాణానికి జలమండలి సర్వే కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో ఇంకుడు గుంతల సర్వేపై ఖైరతాబాద్ సంస్థ ప్రధాన కార్యాలయంలో గురువారం రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్‌కుమార్ సమీక్షించారు.
సిటీబ్యూరో, జూన్ 6 (నమస్తే తెలంగాణ) : వాటర్ ట్యాంకర్ల డిమాండ్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఇంకుడు గుంతల నిర్మాణానికి జలమండలి సర్వే కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో ఇంకుడు గుంతల సర్వేపై ఖైరతాబాద్ సంస్థ ప్రధాన కార్యాలయంలో గురువారం రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్‌కుమార్ సమీక్షించారు. ఈ వేసవిలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో దాదాపుగా 30వేలకు పైగా కుటుంబాలు అధికంగా వాటర్ ట్యాంకర్లు బుక్ చేసుకున్నాయి.
ఆ ప్రాంతాల్లో మళ్లీ ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు మొత్తం 18 స్వచ్ఛంద సంస్థల ద్వారా జలమండలి ఇంకుడు గుంతల సర్వే చేపట్టింది. ఈ సంస్థలకు చెందిన ప్రతినిధులు ఇంకుడు గుంతల నిర్మాణానికి సంబంధించి.. ఇప్పటికే 4736 కుటుంబాలపై సర్వే చేశారని రెవెన్యూ డైరెక్టర్ తెలిపారు. వీరంతా ఆయా కుటుంబాలకు ఇంకుడు గుంతల నిర్మాణం ఆవశ్యకత, అవగాహన కల్పించారని పేర్కొన్నారు. ఫలితంగా 2884 కుటుంబాలు ఇంకుడు గుంతలు నిర్మించుకున్నాయని వెల్లడించారు.
296 కుటుంబాలు వినియోగంలో లేని వాటికి మరమ్మతులు చేసుకున్నట్లు వివరించారు. మిగిలిన 1852 కుటుంబాలు ఇంకుడు గుంతలను నిర్మించుకోవాల్సి ఉన్నదన్నారు. ఆయా కుటుంబాలకు ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా సలహాలు, సూచనలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమీక్షలో ఇంకుడు గుంతల మాజీ ప్రత్యేకాధికారి జాల సత్యనారాయణ, సింగిల్ విండో సెల్ జీఎం దామోదర్ రెడ్డి, స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

