Real Estate | కోట్లు వసూలు చేసి.. బోర్డు తిప్పేసిన రియల్ ఎస్టేట్ సంస్థ
భూమి కొంటే.. ఇచ్చిన డబ్బులకు నెలనెలా వడ్డీ చెల్లిస్తామన్నారు... ఇచ్చిన కాలవ్యవధిలో వడ్డీతోసహా అసలు చెల్లించి.. రిజిస్ట్రేషన్ చేసిన భూమిని తిరిగి తీసుకుంటామని నమ్మించారు. అలా కోట్లాది రూపాయలు వసూలు చేసిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ చివరికి బోర్డు తిప్పేసింది.
- భూమి కొంటే అసలు.. వడ్డీ చెల్లిస్తామంటూ.. మోసం
- కేపీహెచ్‌బీకాలనీ పీఎస్‌ను ఆశ్రయించిన బాధితులు
Real Estate | కేపీహెచ్‌బీ కాలనీ, సెప్టెంబర్ 6 : భూమి కొంటే.. ఇచ్చిన డబ్బులకు నెలనెలా వడ్డీ చెల్లిస్తామన్నారు… ఇచ్చిన కాలవ్యవధిలో వడ్డీతోసహా అసలు చెల్లించి.. రిజిస్ట్రేషన్ చేసిన భూమిని తిరిగి తీసుకుంటామని నమ్మించారు. అలా కోట్లాది రూపాయలు వసూలు చేసిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ చివరికి బోర్డు తిప్పేసింది. మోసం పోయామని గుర్తించిన బాధితులు కేపీహెచ్‌బీ కాలనీ పోలీస్‌స్టేషన్‌కు క్యూ కట్టారు.
పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీ కాలనీ, సర్దార్ పటేల్ నగర్లో కె.సురేశ్‌కుమార్, వెంకటేశ్ రెండేండ్ల కిందట వీ వన్ ఇన్ ఫ్రా గ్రూపు పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థను ఏర్పాటు చేశారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం, నర్సాపూర్ గ్రామంలో సంస్థకు చెందిన 30 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టారు. ఈ స్థలంలో గుంటకు ఐదు లక్షలుగా రేటు ఫిక్స్చేసి.. మార్కెట్ చేయడం మొదలు పెట్టారు.
ఐదు లక్షలు చెల్లించిన వారికి గుంట భూమిని రిజిస్ట్రేషన్ చేస్తారు. ఆ తర్వాత నెల నుంచి చెల్లించిన ఐదు లక్షలకు గాను.. ప్రతి నెలా రూ.20వేల చొప్పున వడ్డీ చెల్లిస్తారు. 25 నెలల కాలవ్యవధి తర్వాత వడ్డీతోపాటు అసలు చెల్లించి.. కొనుగోలు చేసిన భూమిని తిరిగి తీసుకుంటామనేది సంస్థ వాగ్ధానం. దీన్ని నమ్మిన చాలామంది వడ్డీతో పాటు.. అసలు కూడా వస్తుందని ఆశతో భూములను కొన్నారు. మొదట్లో భూమిని కొన్నవారికి నమ్మకంగా వడ్డీ చెల్లించారు. దీంతో ఒకరికి తెలియకుండా మరొకరు భూమిని కొనుగోలు చేశారు.
అయితే అందులో కొందరికీ నెలనెలా వడ్డీ రాకపోవడంతో సంస్థ కార్యాలయానికి వచ్చి ఆరా తీయగా.. సరైన సమాధానం రాలేదు. అలాగే.. ఎండీ సురేశ్‌కుమార్ కూడా కనిపించలేదు. దీంతో మోసపోయామని గుర్తించిన దాదాపు 80 మంది బాధితులు.. శుక్రవారం కేపీహెచ్‌బీ కాలనీ పీఎస్‌ను ఆశ్రయించారు. అయితే ఏడుగురు మాత్రమే ఫిర్యాదు చేశారని, ఈ కేసును ఇవోడబ్ల్యూ పోలీసు విభాగం దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటేశ్వర్రావు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘యూత్ డిక్లరేషన్ హామీలు అమలు చేయాలి’
Agriculture university | వీసీ అల్డాస్ జానయ్యపై నో యాక్షన్.. ప్రభుత్వం దేని కోసం ఉన్నదంటూ నిరసనలు.. వీడియో
Man Kills Nephew To Sell Organs | అవయవాలు అమ్మి డబ్బు సంపాదించేందుకు.. బాలుడిని చంపిన బంధువు
Fire accident | ఇంట్లో ఘోర అగ్నిప్రమాదం.. కుటుంబంలోని ఆరుగురూ దుర్మరణం..!
Womens Health | నెలసరి ముందు వచ్చే సమస్యలను తగ్గించుకునేందుకు మహిళలు ట్యాబ్లెట్లను వాడాలా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

