అద్దె కార్ల బిల్లులు చెల్లించండి
అద్దె కార్ల బిల్లులు సకాలంలో చెల్లించాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. మూడేండ్ల నుంచి బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
సిటీబ్యూరో, ఆగస్టు 29 ( నమస్తే తెలంగాణ ) : అద్దె కార్ల బిల్లులు సకాలంలో చెల్లించాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. మూడేండ్ల నుంచి బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల దృష్ట్యా నెలకు రూ.33వేలు సరిపోవడం లేదని, వాహనాల అద్దె ధరలు పెంచాలని రవాణా శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని వాపోయారు. గత ఏడాది తమ కష్టాన్ని దోచుకుంటున్నారని, తమ హక్కులు కాలరాయబడుతున్నాయని మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేయగా ఇటీవల రవాణా శాఖకు ఫేర్ ధరలను పరిశీలించాలని ఆదేశించినట్టు తెలంగాణ ఫోర్ వీలర్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ తెలిపారు.
కానీ ఇప్పటి వరకు రవాణా శాఖ అధికారులు స్పందించలేదని పేర్కొన్నారు. 33 శాఖలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 34వేల కార్లను అద్దెకు వినియోగంలో ఉన్నాయని వివరించారు. గత ప్రభుత్వంలో నెలకు రూ.55వేలు చెల్లించేల ప్రణాళికలు చేసినట్టు వివరించారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 3 ఏండ్లు సమీపిస్తున్నా ఇప్పటి వరకు అద్దె కార్ల ఓనర్ల సమస్యలు పరిష్కరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాఖలకు సంబంధించి అన్ని అద్దె కార్ల బిల్లులు విడుదలయ్యేల ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చొరవ తీసుకోవాలని కోరారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahela Jayawardene | హెడ్ కోచ్ జయవర్ధనేతో బంధానికి తెర.. కొత్త హెడ్కోచ్ కోసం ముంబై ఇండియన్స్ కసరత్తు..!
Blue Drum Case | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితురాలికి మరణశిక్ష.. 10 నెలల కూతురు పరిస్థితి ఏంటి
I Hate Marriage | ‘ఐ హేట్ మ్యారేజ్’ టీజర్ విడుదల.. జెన్ జీ ఆలోచనలతో యూత్ఫుల్ ఎంటర్టైనర్!
MLA Anil Jadhav | సోయాబిన్ కొనుగోళ్లు సక్రమంగా చేపట్టాలి : ఎమ్మెల్యే అనిల్ జాదవ్
Vigilance Raids | గద్వాల జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

