మణికొండ, జూలై 21: మణికొండలోని వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం ఐటీ చదువుతున్న విద్యార్ధినని శ్రేయ ఆత్మహత్యకు పాల్పడిన విషాదాన్ని నింపింది. ఈ సంఘటనతో కళాశాల విద్యార్ధులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఘటన అనంతరం వెలుగులోకి వచ్చినట్లు చెబుతున్న లేఖలో కళాశాలలో తనపై జరిగిన వ్యక్తిగత అవమానాలు, మానసిక వేధింపుల గురించి ప్రస్తావించడంతో ఈ ఘటన సంచలనంగా మా రింది.
లేఖలో శ్రేయ, పరీక్ష సమయంలో ఒకసారి మొబైల్ ఫోన్ తీసుకెళ్లినందుకు తనపై చర్యలు తీసుకున్న విషయాన్ని అంగీకరిస్తూనే, ఆ తర్వాత ఎలాంటి తప్పు చేయకపోయినా తన ను పదేపదే లక్ష్యంగా చేసుకుకి కొందరు ఫ్యాకల్టీ సభ్యులు అవమానించారని ఆరోపించింది. పరీక్షకు వెళ్తున్న సమయం లో తనపై నీలాంటి వాళ్లు ఎప్పటికీ మారరు అంటూ అవమానకర వాఖ్యలు చేశారని, మరో సందర్భంలో కూడా తనను ఉద్దేశించి కించపరిచేలా మాట్లాడారని లేఖలో పేర్కొంది. ఈ ఘటనపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేసినట్లు ఇన్స్పెక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు.