అధిక అద్దెలు… ఆదరణ కరువు
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో రవాణా ఆధారిత అభివృద్ధి (ట్రాన్సిట్ ఓరియెంటెడ్ డెవలప్మెంట్-టీవోడీ)కి ప్రాధాన్యత లేకుండా పోతోంది. ముఖ్యంగా మెట్రో రైళ్లలోనే ప్రయాణం చేస్తూ ఆయా స్టేషన్లలో షాపింగ్ చేసేలా ప్రత్యేకంగా వాణిజ్య స్థలాలను ప్రతి మెట్రోస్టేషన్లోనూ నిర్మించారు.
- మెట్రో స్టేషన్లలో ఖాళీగా వ్యాపార స్థలాలు
సిటీబ్యూరో, జూలై 17 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో రవాణా ఆధారిత అభివృద్ధి (ట్రాన్సిట్ ఓరియెంటెడ్ డెవలప్మెంట్-టీవోడీ)కి ప్రాధాన్యత లేకుండా పోతోంది. ముఖ్యంగా మెట్రో రైళ్లలోనే ప్రయాణం చేస్తూ ఆయా స్టేషన్లలో షాపింగ్ చేసేలా ప్రత్యేకంగా వాణిజ్య స్థలాలను ప్రతి మెట్రోస్టేషన్లోనూ నిర్మించారు.
ప్రతి రోజూ 5 లక్షల మంది నగర వాసులు మెట్రో రైళ్లలో ప్రయాణం చేస్తున్నా.. వారికి అవసరమైన షాపింగ్ సెంటర్లను స్టేషన్లలో అందుబాటులోకి తీసుకురావడం లేదు. కేవలం 4-5 మెట్రో స్టేషన్లు మినహాయిస్తే మరెక్కడా షాపింగ్ సెంటర్ల జాడ కనిపించడం లేదు. కేవలం అమీర్పేటలోనే వ్యాపార కార్యకలాపాలు కొంతమేర అనుకున్న స్థాయిలో ఉన్నాయి.
ఇక ప్రారంభ మెట్రో స్టేషన్లైన ఎల్బీనగర్, మియాపూర్, జేఎన్టీయూ, నాగోల్, రాయదుర్గం,హైటెక్ సిటీ వంటి స్టేషన్లలో వ్యాపారాలు ఏర్పాటు చేసిన వారు ఎక్కువ కాలం వాటిని నిర్వహించలేకపోతున్నట్లు సమాచారం. స్టేషన్లలో ఉన్న వాణిజ్య స్థలాలను అద్దెకు తీసుకోవాలంటే చదరపు అడుగుకు రూ.80 నుంచి రూ.100ల వరకు కోట్ చేస్తున్నారు. ఈ స్థాయిలో వాణిజ్య స్థలాల ధరలు ఉంటే.. తాము ఎలా వ్యాపారాలు చేస్తామని నిర్వాహకులు వాపోతున్నారు.
వర్ష సూచన
సిటీబ్యూరో, జూలై 17 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి తోడు చురుకుగా కదులుతున్న రుతుపవనాల ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి తేలికపాటి వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. కాగా, అల్పపీడనం ప్రభావంతో గ్రేటర్లోని లింగంపల్లి, రామచంద్రాపురం, చందానగర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

