Rangareddy | మైలార్‌దేవ్‌పల్లిలో జంట హత్యల కలకలం.. నిందితుడు అరెస్ట్
Rangareddy | మద్యానికి బానిసై నిత్యం కుటుంబ సభ్యులను వేధిస్తోన్న ఓ తండ్రిని, అడ్డుకునేందుకు ప్రయత్నించిన బంధువును ఓ యువకుడు అత్యంత దారుణంగా హత్య చేశాడు. మైలార్‌దేవ్‌పల్లి బాబుల్ రెడ్డి నగర్లో చోటుచేసుకున్న ఈ జంట హత్యలు స్థానికంగా కలకలం రేపాయి.
Rangareddy | రంగారెడ్డి : మద్యానికి బానిసై నిత్యం కుటుంబ సభ్యులను వేధిస్తోన్న ఓ తండ్రిని, అడ్డుకునేందుకు ప్రయత్నించిన బంధువును ఓ యువకుడు అత్యంత దారుణంగా హత్య చేశాడు. మైలార్‌దేవ్‌పల్లి బాబుల్ రెడ్డి నగర్లో చోటుచేసుకున్న ఈ జంట హత్యలు స్థానికంగా కలకలం రేపాయి.
వివరాల్లోకి వెళ్తే.. బాబుల్ రెడ్డి నగర్‌కు చెందిన లక్ష్మీనారాయణ మద్యానికి బానిస అయ్యాడు. మద్యం సేవించిన అనంతరం భార్యాపిల్లలను వేధింపులకు గురి చేసేవాడు. కొన్ని రోజుల క్రితం సొంతింటిని కూడా అమ్మానికి పెట్టారు. ఇల్లు అమ్మితే వచ్చే నగదులో తనకు రూ. 20 లక్షలు ఇవ్వాలని భార్యతో శనివారం సాయంత్రం గొడవకు దిగాడు లక్ష్మీనారాయణ. భార్య ఒప్పుకోకపోవడంతో ఆమెపై దాడి చేశాడు.
దాడి నుంచి తల్లిని కాపాడుకునేందుకు ప్రయత్నించిన కుమారుడు రాకేశ్‌పైనా కూడా లక్ష్మీనారాయణ దాడికి దిగాడు. డబ్బుల కోసం అమ్మను కొడతావా అంటూ.. తండ్రిని ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చాడు. ఆ తర్వాత ఇనుపరాడ్డుతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన లక్ష్మీనారాయణకు సాయం చేసేందుకు వచ్చిన బంధువుపైనా కూడా రాకేశ్ దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.
దీంతో లక్ష్మీనారాయణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, బంధువు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. తన తండ్రి నిత్యం మద్యం సేవించి వేధించేవాడని కూతురు ఆమని తెలిపింది. జంట హత్యలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు రాకేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Keerthy Suresh | విమానంలో కీర్తి సురేష్‌కు చేదు అనుభవం.. మద్యం మత్తులో సెల్ఫీ కోసం వేధించిన ప్రయాణికుడు!
Trisha | జయలలిత పాత్రలో త్రిష.. ఎంజీఆర్ బయోపిక్‌లో కీలక పాత్రకు ఓకే చెప్పిందా!
Glacial Lake Outburst | భూటాన్‌లో హిమానీనదం విస్ఫోటనం.. బెంగాల్, అస్సాంలకు వరద ముప్పు.. కేంద్రం హైఅలర్ట్..!
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబం ట్విట్టర్ రివ్యూ.. వెంకీ కామెడీకి ప్రశంసలు, త్రివిక్రమ్ మ్యాజిక్ వర్కౌట్ అయిందా?
Throat problem | గొంతులో నొప్పి, మంట, గరగర వేధిస్తున్నాయా.. అయితే ఈ వంటింటి చిట్కా మీ కోసమే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

