అక్రమంగా రెమ్‌డెసివిర్ విక్రయం.. ఇద్దరు అరెస్ట్
రెమ్‌డెసివిర్ | నగరంలో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం

హైదరాబాద్ : నగరంలో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం రాత్రి రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న శంకర్ నారాయణ సుబ్రమణ్యం(42), మెట్టు శ్రీకాంత్(33)ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరిద్దరి నుంచి ఆరు వయల్స్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే వీరు ఒక్కో వయల్‌ను రూ. 3,400లకు కొనుగోలు చేసి, దాన్ని రూ. 10 వేలకు విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇద్దరు నిందితులను ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

