TSRTC | సంక్రాంతి పండక్కి ఉప్పల్ క్రాస్ రోడ్డు నుంచి సొంతూళ్లకు వెళ్లే వారికి అలర్ట్! ఉప్పల్ క్రాస్ రోడ్డు నుంచి భువనగిరి-యాదగిరిగుట్ట, మోత్కూరు, తొర్రూరు వైపునకు వెళ్లే బస్సులను టీఎస్ఆర్టీసీ మార్చింది. యాదగిరిగుట్ట, తొర్రూర్ బస్టాప్‌లను లిటిల్ ఫ్లవర్ స్కూల్ సమీపంలోకి ఆర్టీసీ మార్చింది. ఒక్కో బస్టాప్‌ను 300 మీటర్ల డిస్టాన్స్తో ఏర్పాటు చేసింది. హన్మకొండ వైపునకు వెళ్లే బస్సులు మాత్రం యథావిధి స్థానంలో ఆపనున్నారు.
మహాలక్ష్మీ పథకం నేపథ్యంలో బస్సుల్లో మహిళల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఈ సంక్రాంతికి రెగ్యులర్, స్పెషల్ బస్సులన్నీ ఉప్పల్ క్రాస్ రోడ్డు సమీపంలోని ఈ బస్టాప్‌ల నుంచే బయలుదేరతాయని అన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు.