పార్టీ ఆవిర్భావ సంబురాల్లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
అంబర్‌పేట/గోల్నాక/కాచిగూడ, ఏప్రిల్ 27 : టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ వేడుకలు బుధవారం అంబర్‌పేట నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ వేడుకలను నిర్వహించారు.
ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎడ్ల సుధాకర్‌రెడ్డి, కార్పొరేటర్లు దూసరి లావణ్యశ్రీనివాస్‌గౌడ్, ఇ.విజయ్‌కుమార్‌గౌడ్, మాజీ కార్పొరేటర్లు కె.పద్మావతి, గరిగంటి శ్రీదేవిరమేష్, పార్టీ డివిజన్ల అధ్యక్షులు మేడి ప్రసాద్, చంద్రమోహన్, భీష్మాదేవ్, కొమ్ము శ్రీనివాస్, సిద్ధార్థ్ముదిరాజ్ తదితరులు వారి వారి డివిజన్లలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని కూడళ్లను గులాబీ తోరణాలతో అలంకరించారు.