అడిక్‌మెట్ ఫ్లైఓవర్‌పై ట్రాఫిక్ ఆంక్షలు
నల్లకుంట ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో అడిక్‌మెట్ బ్రిడ్జి (ఆర్ఓబీ ఫ్లై ఓవర్) మరమ్మతుల నేపథ్యంలో ఈ నెల 12 నుంచి వచ్చే నెల 11వ తేదీ వరకు బ్రిడ్జిపై రాకపోకలు సాగించే వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.
- మరమ్మతులే కారణం 30 రోజుల పాటు నిర్ణయం
- సమయానుకూలంగా ప్రత్యామ్నాయ మార్గాలు
- నవంబర్ 11 వరకు..అడిక్‌మెట్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
సిటీబ్యూరో, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): నల్లకుంట ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో అడిక్‌మెట్ బ్రిడ్జి (ఆర్ఓబీ ఫ్లై ఓవర్) మరమ్మతుల నేపథ్యంలో ఈ నెల 12 నుంచి వచ్చే నెల 11వ తేదీ వరకు బ్రిడ్జిపై రాకపోకలు సాగించే వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.
- తెల్లవారుజాము 5 నుంచి రాత్రి 10 గంటల వరకు తార్నాక, హబ్సిగూడ, సికింద్రాబాద్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులతో పాటు ఇతర భారీ వాహనాలను విద్యానగర్ ‘వై’ జంక్షన్ వద్ద విద్యానగర్ ఆర్‌ఓబీపై నుంచి ఎన్సీసీ మీదుగా ఉస్మానియా యూనివర్సిటీ రోడ్ నుంచి వెళ్లాలి.
- విద్యానగర్ వై జంక్షన్ నుంచి తార్నాక, చిలకలగూడ, సికింద్రాబాద్ వైపు వెళ్లే వాహనాలను రాంనగర్ టీ జంక్షన్ వద్ద రాంనగర్ గుండు, లలిత్నగర్, బౌద్ధనగర్ ఎక్స్‌రోడ్డు, వారాసిగూడ, సీతాఫల్మండి ఆర్ఓబీ నుంచి ఓయూ రోడ్డులోకి వెళ్లాలి.
- రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు విద్యానగర్ వై జంక్షన్ నుంచి రాంనగర్ టీ జంక్షన్.. రాంనగర్ గుండు వైపు వెళ్లే వాహనాలను రాంనగర్ గుండు మీదుగా రాంనగర్ క్రాస్ రోడ్డులోకి మళ్లిస్తారు. భారీ వాహనాలకు అనుమతి లేదు.
- తెల్లవారుజాము 5 నుంచి రాత్రి 10 గంటల వరకు తార్నాక జంక్షన్ నుంచి విద్యానగర్ వైపు వచ్చే ఆర్టీసీ బస్సులతో పాటు ఇతర భారీ వాహనాలను ఓయూ వై జంక్షన్ వద్ద యూనివర్సిటీ రోడ్లోకి మళ్లించడంతో ఎన్సీసీ, విద్యానగర్ రోడ్డులోకి మళ్లిస్తారు. అలాగే, విద్యానగర్ నుంచి వచ్చే లైట్ మోటారు వాహనాలు కూడా ప్రొఫెసర్ రాంరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ మీదుగా బౌద్దనగర్ క్రాస్‌రోడ్డు వైపు మళ్లిస్తారు.
- రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు తార్నాక జంక్షన్ నుంచి వచ్చే భారీ వాహనాలను సీతాఫల్మండి టీ జంక్షన్ వద్ద సీతాఫల్మండి ఆర్ఓబీపైకి మళ్లిస్తారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

