26న హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ : ఈ నెల 26వ తేదీన హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సందర్శించనున్నారు. దీంతో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. గచ్చిబౌలి స్టేడియం నుంచి ట్రిపుల్ ఐటీ జంక్షన్ వరకు, ట్రిపుల్ ఐటీ జంక్షన్ నుంచి విప్రో జంక్షన్ వరకు ట్రాఫిక్ రూల్స్ వర్తిస్తాయి.
గచ్చిబౌలి జంక్షన్ నుంచి లింగంపల్లి వెళ్లే వాహనదారులు.. గచ్చిబౌలి జంక్షన్ – రైట్ టర్న్- బొటానికల్ గార్డెన్ – లెఫ్ట్ టర్న్ – కొండాపూర్ ఏరియా హాస్పిటల్ – మజీద్ బండ – లెఫ్ట్ టర్న్ – మజీద్ బండ కమాన్ – రైట్ టర్న్ – హెచ్‌సీయూ డిపో మీదుగా వెళ్లాలి.
లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వెళ్లే వాహనదారులు.. హెచ్‌సీయూ డిపో – లెఫ్ట్ టర్న్ – మజీద్ బండ కమాన్ – లెఫ్ట్ టర్న్ – మజీద్ బండ – కొండాపూర్ ఏరియా హాస్పిటల్ – బొటానికల్ గార్డెన్ – రైట్ టర్న్ మీదుగా గచ్చిబౌలి జంక్షన్‌కు చేరుకోవచ్చు.
విప్రో నుంచి లింగంపల్లి వెళ్లే వాహనదారులు.. విప్రో జంక్షన్ – లెఫ్ట్ టర్న్ – క్యూ సిటీ – గౌలిదొడ్డి – గోపన్‌పల్లి ఎక్స్ రోడ్ – రైట్ టర్న్ – హెచ్‌సీయూ బ్యాక్ గేట్ – నల్లగండ్ల మీదుగా లింగంపల్లి రోడ్డుకు వెళ్లాలి.
విప్రో నుంచి గచ్చిబౌలి జంక్షన్ వెళ్లే వాహనదారులు.. విప్రో జంక్షన్ – రైట్ టర్న్ – ఫెయిర్‌ఫీల్డ్ హోటల్ – నానక్‌రాంగూడ రోటరీ – లెఫ్ట్ టర్న్ – ఓఆర్ఆర్ – ఎల్ అండ్ టీ టవర్స్ మీదుగా గచ్చిబౌలి జంక్షన్ చేరుకోవచ్చు.
దుర్గం చెరువు కేబుల్ నుంచి గచ్చిబౌలి జంక్షన్ వెళ్లే వాహనదారులు.. కేబుల్ బ్రిడ్జి అప్ ర్యాంప్ – రోడ్ నంబర్ 45 – రత్నదీప్ – మాదాపూర్ ఎల్ అండ్ ఓ పీఎస్ – సైబర్ టవర్స్ – హెటైక్స్ – కొత్తగూడ- బొటానికల్ గార్డెన్ మీదుగా గచ్చిబౌలి జంక్షన్ వెళ్లాలి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

