Hanuman Shobhayatra | రేపు హైదరాబాద్‌లో హనుమాన్ శోభాయాత్ర.. ట్రాఫిక్ ఆంక్షలు అమలు
Hanuman Shobhayatra | ఏప్రిల్ 12వ తేదీన హనుమాన్ జయంతి నేపథ్యంలో రేపు హైదరాబాద్ నగరంలో హనుమాన్ శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో హనుమాన్ శోభాయాత్ర జరిగే మార్గంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Hanuman Shobhayatra | హైదరాబాద్ : ఏప్రిల్ 12వ తేదీన హనుమాన్ జయంతి నేపథ్యంలో రేపు హైదరాబాద్ నగరంలో హనుమాన్ శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో హనుమాన్ శోభాయాత్ర జరిగే మార్గంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శనివారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. హనుమాన్ శోభాయాత్ర గౌలిగూడలోని రామమందిరం వద్ద ఉదయం 11 గంటలకు ప్రారంభమై.. తాడ్బండ్లోని హనుమాన్ మందిరం వరకు కొనసాగనుంది.
హనుమాన్ శోభాయాత్ర రూట్ మ్యాప్ ఇదే..
గౌలిగూడ, పుత్లిబౌలి క్రాస్ రోడ్స్, ఆంధ్రా బ్యాంక్ క్రాస్ రోడ్స్, కోఠి, సుల్తాన్ బజార్ క్రాస్ రోడ్స్, రామ్‌కోఠి క్రాస్ రోడ్స్, కాచిగూడ క్రాస్ రోడ్స్, నారాయణగూడ వైఎంసీఏ, చిక్కడపల్లి క్రాస్ రోడ్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్ నగర్, గాంధీ నగర్ బ్యాక్ సైడ్ వైశ్రాయ్ హోటల్, ప్రాగా టూల్స్, కవాడిగూడ, సీజీవో టవర్స్, బన్సీలాల్‌పేట రోడ్డు, బైబిల్ హౌస్, సిటీ లైట్ హోటల్, బాటా షోరూమ్, ఉజ్జయిని మహంకాళి టెంపుల్, ఓల్డ్ రామ్‌గోపాల్‌పేట్ రోడ్, పారడైజ్ క్రాస్ రోడ్స్, సీటీవో జంక్షన్, లీ రాయల్ ప్యాలెస్, బ్రూక్ బాండ్, ఇంపిరీయల్ గార్డెన్, మస్తాన్ కేఫ్ మీదుగా తాడ్బండ్లోని శ్రీ హనుమాన్ టెంపుల్ వద్దకు శోభాయాత్ర కొనసాగనుంది.
ఈ మార్గంలో వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాక మార్గాలు ఎంచుకోవాలని సూచించారు. లక్డీకాపూల్ నుంచి సికింద్రాబాద్ స్టేషన్, ఉప్పల్ వైపు వెళ్లే వాహనదారులు వీవీ స్టాచ్యూ, సోమాజిగూడ, గ్రీన్ ల్యాండ్స్, బేగంపేట్ ఫ్లై ఓవర్, ప్రకాశ్ నగర్ ఫ్లై ఓవర్, పారడైస్ ఫ్లై ఓవర్ మీదుగా సికింద్రాబాద్ స్టేషన్ చేరుకోవాలని సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

