రేపట్నుంచి 3 నెలల పాటు రసూల్‌పురా – రాంగోపాల్‌పేట మధ్య ట్రాఫిక్ ఆంక్షలు
Traffic restrictions | హైదరాబాద్‌లోని రసూల్‌పురా - రాంగోపాల్‌పేట మధ్య రేపట్నుంచి మూడు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. రసూల్‌పురా - రాంగోపాల్‌పేట మధ్య నాలా పనుల
హైదరాబాద్ : హైదరాబాద్‌లోని రసూల్‌పురా – రాంగోపాల్‌పేట మధ్య రేపట్నుంచి మూడు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. రసూల్‌పురా – రాంగోపాల్‌పేట మధ్య నాలా పనుల కారణంగానే ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఆంక్షలు నంబర్ 18 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 16వ తేదీ వరకు అమల్లో ఉండనున్నాయి. వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..
-బేగంపేట ఫ్లై ఓవర్ నుంచి వాహనదారులకు రసూల్‌పురా టీ జంక్షన్ వద్ద రైట్ టర్న్‌కు అనుమతి ఇవ్వరు. కిమ్స్ హాస్పిటల్, మినిస్టర్ రోడ్, రాణిగంజ్, నల్లగుట్ట, పీవీఎన్ఆర్ మార్గ్ వైపు వెళ్లే వాహనాలు.. సీటీవో ఫ్లైఓవర్ కింద యూటర్న్ తీసుకొని హనుమాన్ టెంపుల్ బై లేన్ మీదుగా డైవర్షన్ తీసుకొని ఫుడ్ వరల్డ్, సింధి కాలనీ, రామ్‌గోపాల్‌పేట పీఎస్, మినిస్టర్ రోడ్, కిమ్స్ హాస్పిటల్ వెళ్లొచ్చు.
-రాణిగంజ్, నల్లగుట్ట, పీవీఎన్ఆర్ మార్గ్ నుంచి వచ్చే వాహనదారులను రసూల్‌పురా వైపు అనుమతించరు. రాంగోపాల్‌పేట పీఎస్ వద్ద రైట్ టర్న్ తీసుకొని సింధి కాలనీ, ఫుడ్ వరల్డ్, హనుమాన్ టెంపుల్ వద్ద లెఫ్ట్ టర్న్ తీసుకొని రసూల్‌పురా వైపు వెళ్లొచ్చు.
-సికింద్రాబాద్ నుంచి కిమ్స్ వైపు వచ్చే వాహనదారులు హనుమాన్ టెంపుల్ బై లేన్ వద్ద డైవర్షన్ తీసుకోవాలి. ఫుడ్ వరల్డ్, సింధి కాలనీ, రాంగోపాల్‌పేట పీఎస్, లెఫ్ట్ టర్న్ తీసుకొని మినిస్టర్ రోడ్డు మీదుగా కిమ్స్ చేరుకోవచ్చు. లేదా సీటీవో, ప్యారడైస్, రాణిగంజ్ వద్ద రైట్ టర్న్ తీసుకొని కిమ్స్ చేరుకోవచ్చు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

