హైదరాబాద్‌లో 9 నుంచి 11వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు
Traffic Restrictions | హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ మార్గ్‌లో ఈ నెల 10, 11వ తేదీల్లో ఇండియన్ రేసింగ్ లీగ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో 9న ఉదయం 11 గంటల నుంచి 11వ తేదీన లీగ్ ముగిసే వరకు ఆయా
హైదరాబాద్ : హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ మార్గ్‌లో ఈ నెల 10, 11వ తేదీల్లో ఇండియన్ రేసింగ్ లీగ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో 9న ఉదయం 11 గంటల నుంచి 11వ తేదీన లీగ్ ముగిసే వరకు ఆయా మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. లుంబినీ, ఎన్టీఆర్ గార్డెన్‌ను కూడా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఇండియన్ రేసింగ్ లీగ్.. నెక్లెస్ రోటరీ నుంచి తెలుగు తల్లి జంక్షన్, కొత్త సెక్రటేరియట్ నుంచి ఎన్టీఆర్ గార్డెన్, మింట్ కంపౌండ్, ఐమ్యాక్స్ వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, ఐమ్యాక్స్ థియేటర్ల వైపు వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. అవసరమైతే 7, 8 తేదీల్లోను ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తామని పేర్కొన్నారు.
ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..
-వీవీ విగ్రహం(ఖైరతాబాద్) వైపు నుంచి నెక్లెస్ రోటరీ వైపు ట్రాఫిక్ అనుమతి లేదు. వీవీ విగ్రహం వద్ద షాదన్ కాలేజ్, రవీంధ్రభారతి వైపు మళ్లిస్తారు.
-బుద్దభవన్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వాహనాలకు అనుమతి లేదు. ఈ వాహనాలను నల్లగుట్ట జంక్షన్ నుంచి రాణిగంజ్, ట్యాంక్‌బండ్ వైపు మళ్లిస్తారు.
-రసూల్‌పురా, మినిస్టర్ రోడ్డు నుంచి నెక్లెస్ రోటరీ వైపు నల్లగుట్ట మీదుగా వచ్చే వాహనాలను, నల్లగుట్ట జంక్షన్ వద్ద రాణిగంజ్ వైపు మళ్లిస్తారు.
-ఇక్బాల్ మినార్ నుంచి తెలుగు తల్లిజంక్షన్, ట్యాంక్ బండ్ వైపు వాహనాలకు అనుమతి లేదు. ఈ వాహనాలను ఫ్లైఓవర్ పైనుంచి కట్టమైసమ్మ ఆలయం, లోయర్ ట్యాంక్‌బండ్ వైపు మళ్లిస్తారు.
-ట్యాంక్‌బండ్, తెలుగుతల్లి జంక్షన్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వాహనాలకు అనుమతి లేదు. తెలుగు తల్లి జంక్షన్ నుంచి ఇక్బాల్ మినార్, రవీంద్ర భారతి జంక్షన్ వైపు మళ్లించనున్నారు.
-బీఆర్కే భవన్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను తెలుగు తల్లి జంక్షన్ నుంచి ఇక్బాల్మినార్, రవీంద్ర భారతి జంక్షన్ వైపు మళ్లిస్తారు.
-ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి మింట్ కంపౌండ్ వైపు వాహనాలను అనుమతి లేదు. ఈ వాహనాలను రవీంద్ర భారతి జంక్షన్ వైపు మళ్లిస్తారు.
-ఖైరతాబాద్ బడా గణేష్ వైపు నుంచి ప్రింటింగ్ ప్రెస్, నెక్లెస్ రోటరీ వైపు వాహనాలకు అనుమతి లేదు. ఈ వాహనాలను బడా గణేష్ వద్ద రాజ్‌దూత్ లైన్లోకి మళ్లిస్తారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

