తిప్పలు తప్పించి.. సాఫీగా వెళ్లేలా
ఔటర్ రింగు రోడ్డు మార్గంలో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు పరిష్కార మార్గాలను చూపుతున్నది హెచ్ఎండీఏ. పెరుగుతున్న ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకొని క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసి, మళ్లీ అలాంటి సమస్య పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది.
- నానక్‌రాంగూడ ఔటర్ వద్ద ట్రాఫిక్ నియంత్రణ చర్యలు
- టోల్‌ప్లాజా దగ్గర అదనపు ర్యాంపు నిర్మాణం
- ఇంటర్చేంజ్ వద్ద ఇబ్బందులు తగ్గించేందుకు కసరత్తు
ఔటర్ రింగు రోడ్డు మార్గంలో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు పరిష్కార మార్గాలను చూపుతున్నది హెచ్ఎండీఏ. పెరుగుతున్న ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకొని క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసి, మళ్లీ అలాంటి సమస్య పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది.
ర్యాంపు నిర్మాణ పనులు
గ్రేటర్ చుట్టూ 158 కి.మీ మేర ఉన్న ఓఆర్ఆర్పై అత్యధికంగా గచ్చిబౌలి- శంషాబాద్ ఎయిర్‌పోర్టు మార్గంలోనే వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. శంషాబాద్, రాజేంద్రనగర్, తెలంగాణ పోలీస్ అకాడమీ ఇంటర్‌చేంజ్‌ల మీదుగా నానక్‌రాంగూడ టోల్ ఫ్లాజా దాటిన తర్వాత ఉన్న ఔటర్ ఓఆర్ఆర్ ఇంటర్చేంజ్ వద్ద కిందకు దిగుతున్నాయి. ఇదే సమయంలో రాయదుర్గం, ఖాజాగూడ, విప్రో జంక్షన్, నానక్‌రాంగూడ విలేజ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు నానక్‌రాంగూడ ఇంటర్చేంజ్ వద్ద నిలిచిపోతున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి హెచ్ఎండీఏ అధికారులు క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేశారు. నానక్‌రాంగూడ ఓఆర్ఆర్ టోల్ ప్లాజా దాటగానే కొత్తగా కిందకు దిగడానికి ఒక ర్యాంపు నిర్మాణ పనులు చేపట్టారు.
లింకు రోడ్డుతో అనుసంధానం
నార్సింగి-నానక్‌రాంగూడ ప్రాంతాల మధ్య ఉన్న సర్వీసు రోడ్డును కలుపుతూ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి రెండు చోట్ల కొత్తగా లింకు రోడ్లను ఇటీవలే జీహెచ్ఎంసీ నిర్మించి అందుబాటులోకి తెచ్చింది. గౌలిదొడ్డి, క్యూసిటీ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మీదుగా వచ్చే రోడ్డు వేవ్‌రాక్ నుంచి నానక్‌రాంగూడ టోల్‌ప్లాజా సమీపంలోని సర్వీసు రోడ్డును కలిసేలా అనుసంధానమై ఉంది. ఈ రోడ్డును పరిగణలోకి తీసుకున్న హెచ్ఎండీఏ అధికారులు శంషాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోకి వెళ్లాలంటే నానక్‌రాంగూడ ఓఆర్ఆర్ ఇంటర్చేంజ్ వరకు వెళ్లకుండా అంతకు ముందు కొత్తగా ఏర్పాటు చేసే దిగువ ర్యాంపు మీదుగా వాసవి జీపీ ట్రెండ్స్, వన్ వెస్ట్ టర్మినస్ టవర్ల మధ్య ఉన్న లింకు రోడ్డు మీదుగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఐటీ కంపెనీలకు, ఆ తర్వాత అదే మార్గంలో క్యూ సిటీ, గౌలిదొడ్డి, గోపన్‌పల్లి, నల్లగండ్ల, తెల్లాపూర్ ప్రాంతాలకు వెళ్లేలా రోడ్డు అందుబాటులో ఉందని, దీంతో రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.
ఒత్తిడి తగ్గేలా…
గచ్చిబౌలి వద్ద ఓఆర్ఆర్ మీదుగా ట్రాఫిక్‌తో ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారం చూపుతూ రెండు ఫ్లై ఓవర్లను నిర్మించి ప్రారంభించగా, మరో రెండు ఫ్లై ఓవర్లు నిర్మాణంలో ఉన్నాయి. దీంతో కొంత మేర ట్రాఫిక్ సమస్యలు తగ్గినా, నానక్‌రాంగూడలో తీవ్ర రూపం దాల్చాయి. నానక్‌రాంగూడ ఓఆర్ఆర్ ఇంటర్ చేంజ్‌పై ఒత్తిడి తగ్గించేందుకు టోల్‌ప్లాజా దాటిన వెంటనే వాహనాలకు సర్వీసు రోడ్డులోకి వచ్చేలా కొత్తగా దిగువ ర్యాంపును నిర్మిస్తున్నారు. దీంతో టోల్‌ఫ్లాజా దాటిన వెంటనే వాహనాలు ఐటీ కంపెనీలు అధికంగా ఉన్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, పుప్పాలగూడ, విప్రో జంక్షన్, కోకాపేట, యూఎస్ కాన్సులేట్ భవనం వైపు వెళ్లేందుకు వీలవుతుంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

